Resulu vaasulunu remdu galavaa

రేసులు వాసులును రెండు గలవా
Language

(॥పల్లవి॥)
రేసులు వాసులును రెండు గలవా
వేసరించఁగాని నను వేగించనీరాదా

(॥రేసు॥)
నవ్వితే నవ్వనివాఁడు నన్నేల తప్పక చూచె
యివ్వల నాఁడువారై తే హీనమా యేమి
జవ్వనాన చంకగుదె శరణార్తిఁ దనకేల
వువ్విళ్లూరించక నన్ను నుండవీరాదా

(॥రేసు॥)
ముట్టితే ముట్టినివాఁడు ముందేల సరసమాడె
నెట్టుకొన వలచుటే నేరమా యేమి
తొట్టి యెడఁగ త్తెరయుఁ దోడ నోర బెల్లమేల
పట్టిన వ్రతముతోనే బ్రతుక నీరాదా

(॥రేసు॥)
మొక్కితే మొక్కనివాఁడు మున్నాడి నన్నేల కూడె
దక్కినవారిఁ జొక్కించఁ దడవా యేమి
చెక్కునొక్కి చెట్టివట్టి చేసన్న లిఁకనేల
మిక్కిలి శ్రీవేంకటేశు మెచ్చనీరాదా

(||pallavi||)
resulu vāsulunu rĕṁḍu galavā
vesariṁcham̐gāni nanu vegiṁchanīrādā

(||resu||)
navvide navvanivām̐ḍu nannela tappaga sūsĕ
yivvala nām̐ḍuvārai te hīnamā yemi
javvanāna saṁkagudĕ śharaṇārdim̐ danagela
vuvviḽlūriṁchaga nannu nuṁḍavīrādā

(||resu||)
muṭṭide muṭṭinivām̐ḍu muṁdela sarasamāḍĕ
nĕṭṭugŏna valasuḍe neramā yemi
tŏṭṭi yĕḍam̐ga ttĕrayum̐ doḍa nora bĕllamela
paṭṭina vradamudone braduga nīrādā

(||resu||)
mŏkkide mŏkkanivām̐ḍu munnāḍi nannela kūḍĕ
dakkinavārim̐ jŏkkiṁcham̐ daḍavā yemi
sĕkkunŏkki sĕṭṭivaṭṭi sesanna lim̐kanela
mikkili śhrīveṁkaḍeśhu mĕchchanīrādā