Ṟattu sesugonagu maaṟadiyela neegu neeve

ఱట్టు సేసుకొనకు మాఱడియేల నీకు నీవే
Language

(॥పల్లవి॥)
ఱట్టు సేసుకొనకు మాఱడియేల నీకు నీవే
పట్టితినంతే నీ కొంగు బయలీఁదనేఁటికే

(॥ఱట్టు॥)
అంటుకొని నీ వేపొద్దు నాపెవెంటఁ దిరుగఁగా
నంటున నీమోము చూచి నగరాదా
బంట పంతమా యేమైనాఁ బచారించ నీతోను
అంటి నింతే సన్నకు సన్నంత కెక్కు డేఁటికి

(॥ఱట్టు॥)
సంతము నీవు నాపె సరసము లాడఁగాను
మంతనాన నే నొక మాటాడరాదా
దొంతిపూఁటా యేమైనా తొడరి బలిమిసేయ
కొంత కొసరితి నింతే గురిసేయ నేఁటికి

(॥ఱట్టు॥)
ఆరితేరి యాపె పెండ్లియాడి వచ్చియుండఁగాను
కూరిమి నీ కాఁగిట నేఁ గూడరాదా
మోరతోపా యేమైనా మొక్కితి శ్రీవేంకటేశ
తారుకాణించితి నింతే తమకించ నేటికి

(||pallavi||)
ṟaṭṭu sesugŏnagu māṟaḍiyela nīgu nīve
paṭṭidinaṁte nī kŏṁgu bayalīm̐danem̐ṭige

(||ṟaṭṭu||)
aṁṭugŏni nī vebŏddu nābĕvĕṁṭam̐ dirugam̐gā
naṁṭuna nīmomu sūsi nagarādā
baṁṭa paṁtamā yemainām̐ basāriṁcha nīdonu
aṁṭi niṁte sannagu sannaṁta kĕkku ḍem̐ṭigi

(||ṟaṭṭu||)
saṁtamu nīvu nābĕ sarasamu lāḍam̐gānu
maṁtanāna ne nŏga māḍāḍarādā
dŏṁtibūm̐ṭā yemainā tŏḍari balimiseya
kŏṁta kŏsaridi niṁte guriseya nem̐ṭigi

(||ṟaṭṭu||)
ārideri yābĕ pĕṁḍliyāḍi vachchiyuṁḍam̐gānu
kūrimi nī kām̐giḍa nem̐ gūḍarādā
moradobā yemainā mŏkkidi śhrīveṁkaḍeśha
tārugāṇiṁchidi niṁte tamagiṁcha neḍigi