రట్టడి మగవాఁడవు రమణి యీకె
(॥పల్లవి॥)
రట్టడి మగవాఁడవు రమణి యీకె
దిట్టతనమున నీతో దీకొనఁగ నోపునా
(॥రట్ట॥)
సిగ్గుతోనున్న చెలిపై జేయిచాఁచి పెనఁగేవు
వొగ్గి నీతో సాము సేయనోపునా యీకె
అగ్గమై మోనాననున్న యాపెనేల రేఁచేవు
దిగ్గన ని న్నింతేసి సాదించనోపునా
(॥రట్ట॥)
కొలువులోనున్నదాని గోర నూఁది చెనకేవు
కెలసి నిన్నిందుకు జంకించనోపునా
నిలుచున్నాపెను ముట్టి నీ వేల గిలిగించేవు
నలుగడరా నీతో నవ్వనోపునా
(॥రట్ట॥)
గుట్టుతో డలమేల్మంగ గుబ్బలేల పిసికేవు
అట్టె శ్రీవేంకటేశ నిన్నననోపునా
నెట్టుకొన గూడితివి నీ వీకె నేల మీరేవు
చుట్టరిక మీడేరె సొలయఁగనోపునా
(||pallavi||)
raṭṭaḍi magavām̐ḍavu ramaṇi yīgĕ
diṭṭadanamuna nīdo dīgŏnam̐ga nobunā
(||raṭṭa||)
siggudonunna sĕlibai jeyisām̐si pĕnam̐gevu
vŏggi nīdo sāmu seyanobunā yīgĕ
aggamai monānanunna yābĕnela rem̐sevu
diggana ni nniṁtesi sādiṁchanobunā
(||raṭṭa||)
kŏluvulonunnadāni gora nūm̐di sĕnagevu
kĕlasi ninniṁdugu jaṁkiṁchanobunā
nilusunnābĕnu muṭṭi nī vela giligiṁchevu
nalugaḍarā nīdo navvanobunā
(||raṭṭa||)
guṭṭudo ḍalamelmaṁga gubbalela pisigevu
aṭṭĕ śhrīveṁkaḍeśha ninnananobunā
nĕṭṭugŏna gūḍidivi nī vīgĕ nela mīrevu
suṭṭariga mīḍerĕ sŏlayam̐ganobunā