Rammanee raavayya raampu voddu

రమ్మనీ రావయ్య రాఁపు వొద్దు
Language

(॥పల్లవి॥)
రమ్మనీ రావయ్య రాఁపు వొద్దు
కొమ్మ మనసు నిలిపె(పెఁ?) గొంతవొద్దు

(॥రమ్మ॥)
సమ్మతి నీరాకకు సకినాలు చూచి చూచి
కొమ్మ మనసు నిలిపెఁ గొంతవొద్దు
వుమ్మడి నంతటఁ దనవొరపుసింగారాల
ఇమ్ములఁ బొద్దు గడిపెం తనివొద్దు

(॥రమ్మ॥)
గారవానఁ జెలుల నీకడకంపి, నీరూపు
కూరిమితోఁ దలపోసెఁ గొంతవొద్దు
ఆరసి నీసుద్దులెల్లా నందరితోఁ జెప్పి చెప్పి
యీరీతిఁ బొద్దువుచ్చె నింతవొద్దు

(॥రమ్మ॥)
చిప్పిలేటితమకానఁ జిత్తముతో సమరతి
కుప్పసేసెఁ గోరికలఁ గొంతవొద్దు
ఇప్పుడే విచ్చేసి నీవు ఇంతిని శ్రీవేంకటేశ
తెప్పిరఁగూడితి విట్టె దినము నేపోద్దూ

(||pallavi||)
rammanī rāvayya rām̐pu vŏddu
kŏmma manasu nilibĕ(pĕm̐?) gŏṁtavŏddu

(||ramma||)
sammadi nīrāgagu saginālu sūsi sūsi
kŏmma manasu nilibĕm̐ gŏṁtavŏddu
vummaḍi naṁtaḍam̐ danavŏrabusiṁgārāla
immulam̐ bŏddu gaḍibĕṁ tanivŏddu

(||ramma||)
gāravānam̐ jĕlula nīgaḍagaṁpi, nīrūbu
kūrimidom̐ dalabosĕm̐ gŏṁtavŏddu
ārasi nīsuddulĕllā naṁdaridom̐ jĕppi sĕppi
yīrīdim̐ bŏdduvuchchĕ niṁtavŏddu

(||ramma||)
sippileḍidamagānam̐ jittamudo samaradi
kuppasesĕm̐ gorigalam̐ gŏṁtavŏddu
ippuḍe vichchesi nīvu iṁtini śhrīveṁkaḍeśha
tĕppiram̐gūḍidi viṭṭĕ dinamu neboddū