Ramanumdada ramaninada radula ne naligenaa

రమణుఁడట రమణినట రతుల నే నలిగేనా
Language

(॥పల్లవి॥)
రమణుఁడట రమణినట రతుల నే నలిగేనా
తమి నేఁ జూచితిఁగాక దగ్గరఁ దడవా

(॥రమ॥)
వెగటుగాఁ బిలిచీని వేగిరింబేలే తన-
వగటు చూచితిఁగాక పలుకఁదడవా
మిగుల ననుఁ బైకోనీ మీఁదమీఁద నేఁడు తన-
బిగువు చూచితిఁ గాక పెనఁగఁదడవా

(॥రమ॥)
చెనకుచును సరసములే చిమ్మీని సారెఁ దన-
ననుపు చూచితిఁగాక నవ్వఁదడవా
అనువుగా నా కిచ్చలాడీ నిదేల తన-
చనవు చూచితిఁగాక సతముగాఁ దడవా

(॥రమ॥)
గొణఁగుచును సన్న సేసి కోసరి మొక్కీని తన-
గుణము చూచితిఁగాక కూడఁదడవా
ఆణఁగ కిటు శ్రీవేంకటాధిపుఁడు గూడె నను
గణనకెక్కితిఁగాక కరఁగంగఁదడవా

(||pallavi||)
ramaṇum̐ḍaḍa ramaṇinaḍa radula ne naligenā
tami nem̐ jūsidim̐gāga daggaram̐ daḍavā

(||rama||)
vĕgaḍugām̐ bilisīni vegiriṁbele tana-
vagaḍu sūsidim̐gāga palugam̐daḍavā
migula nanum̐ baigonī mīm̐damīm̐da nem̐ḍu tana-
biguvu sūsidim̐ gāga pĕnam̐gam̐daḍavā

(||rama||)
sĕnagusunu sarasamule simmīni sārĕm̐ dana-
nanubu sūsidim̐gāga navvam̐daḍavā
anuvugā nā kichchalāḍī nidela tana-
sanavu sūsidim̐gāga sadamugām̐ daḍavā

(||rama||)
gŏṇam̐gusunu sanna sesi kosari mŏkkīni tana-
guṇamu sūsidim̐gāga kūḍam̐daḍavā
āṇam̐ga kiḍu śhrīveṁkaḍādhibum̐ḍu gūḍĕ nanu
gaṇanagĕkkidim̐gāga karam̐gaṁgam̐daḍavā