Ramanumda nemdu nee rabamaayanu

రమణుఁడ నేఁడు నీ రపమాయను
Language

(॥పల్లవి॥)
రమణుఁడ నేఁడు నీ రపమాయను
తమకించే విది మంచి తగవాయను

(॥రమ॥)
సొరిది నీవు సేసినచొప్పు లెత్తి యాడఁగాను
విరులఁగొని యాపెను వేసేవు నీవు
మరిగి విన్న కతలు మర్మములు సోఁకితేను
మరునమ్ములు నడుమ మనికాయను

(॥రమ॥)
తలకొన్న నీ కళలు తరుణి చూడఁగాను
జల జలఁ బన్నీరు చల్లేవు నీవు
చలరేఁగినయాసలు చిమ్మిరేఁగి మొలచితే
చలపాది వెడమంచు సందడించెను

(॥రమ॥)
కదిసిన నీ రతులు కాంత గడు మొచ్చఁగాను
వొదిగి గందము మేనఁ బూసేవు నీవు
పొది జవ్వనవన ముప్పొంగితే శ్రీవెంకటేశ
చెదరక వట్టిమాకు చిగిరించెనె

(||pallavi||)
ramaṇum̐ḍa nem̐ḍu nī rabamāyanu
tamagiṁche vidi maṁchi tagavāyanu

(||rama||)
sŏridi nīvu sesinasŏppu lĕtti yāḍam̐gānu
virulam̐gŏni yābĕnu vesevu nīvu
marigi vinna kadalu marmamulu som̐kidenu
marunammulu naḍuma manigāyanu

(||rama||)
talagŏnna nī kaḽalu taruṇi sūḍam̐gānu
jala jalam̐ bannīru sallevu nīvu
salarem̐ginayāsalu simmirem̐gi mŏlaside
salabādi vĕḍamaṁchu saṁdaḍiṁchĕnu

(||rama||)
kadisina nī radulu kāṁta gaḍu mŏchcham̐gānu
vŏdigi gaṁdamu menam̐ būsevu nīvu
pŏdi javvanavana muppŏṁgide śhrīvĕṁkaḍeśha
sĕdaraga vaṭṭimāgu sigiriṁchĕnĕ