Ramanigi neegum bodu raavayyaa

రమణికి నీకుఁ బోదు రావయ్యా
Language

(॥పల్లవి॥)
రమణికి నీకుఁ బోదు రావయ్యా
అమరు నిన్నికె యేమనినా నేమాయను

(॥రమ॥)
పంతము లాడుకొందురు పలుమారు సొలతురు
ఇంతులకు నివియెల్లా నెగ్గులు గావు
కొంతగొంత దూరుదురు కూరిమి గొసరుదురు
వింతలేని విభునికి వెగటు గాదు

(॥రమ॥)
చూపుల నద్దలింతురు చొప్పలు వెదకుదురు
రాపుల నివెల్లా నేరములు గావు
వోపి సరి వెనుగుదు రొట్లెల్లాఁ బెట్టుదురు
పైపై గుంపెనలెకాని పల్లదాలు గావు

(॥రమ॥)
బలుతురు పిలుతురు బొమ్మల జంకింతురు
తలపోసితే నివెల్లా తప్పలు గావు
యెలమి శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి
మలసి వెరగందితే మరపులు గావు

(||pallavi||)
ramaṇigi nīgum̐ bodu rāvayyā
amaru ninnigĕ yemaninā nemāyanu

(||rama||)
paṁtamu lāḍugŏṁduru palumāru sŏladuru
iṁtulagu niviyĕllā nĕggulu gāvu
kŏṁtagŏṁta dūruduru kūrimi gŏsaruduru
viṁtaleni vibhunigi vĕgaḍu gādu

(||rama||)
sūbula naddaliṁturu sŏppalu vĕdaguduru
rābula nivĕllā neramulu gāvu
vobi sari vĕnugudu rŏṭlĕllām̐ bĕṭṭuduru
paibai guṁpĕnalĕgāni palladālu gāvu

(||rama||)
baluduru piluduru bŏmmala jaṁkiṁturu
talaboside nivĕllā tappalu gāvu
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ yelidivi
malasi vĕragaṁdide marabulu gāvu