రతుల యెంగిలిపొత్తు రామలకుఁ దగునా
(॥పల్లవి॥)
రతుల యెంగిలిపొత్తు రామలకుఁ దగునా
బతిమాలి నీవెంత పచ్చియైవుందానవే
(॥రతు॥)
చెంగట నుండి యాతనిసేవలు నేఁ జేయఁగాను
అంగవిచ్చి యేల వుపాయాలు చెప్పేవే
ముంగిట నేమిద్దరము ముచ్చటలాడుకోఁగా
తొంగిచూచి నీవదేమి తోడుగూచుండేవే
(॥రతు॥)
వేడుకతోఁ బతివొద్ద వీణె నే వాయించఁగాను
జోడుగావచ్చినీవేమి సుతిగూడేవే
వీడెమిచ్చి తములము వెస నేఁ బెట్టిపంచుకోఁగా
జాడతో నీవేమి చెయిచాఁచబూఁచేవే
(॥రతు॥)
అలమేలుమంగ నేను అతఁడు శ్రీవేంకటేశుఁ-
డెలమి నీపేరు మరి యేమందురే
కలసె నాతఁడు నన్ను కాచుక నీవుండితివి
చెలిమిసేసి నాకిట్టె చెల్లెల వయితివే
(||pallavi||)
radula yĕṁgilibŏttu rāmalagum̐ dagunā
badimāli nīvĕṁta pachchiyaivuṁdānave
(||radu||)
sĕṁgaḍa nuṁḍi yādanisevalu nem̐ jeyam̐gānu
aṁgavichchi yela vubāyālu sĕppeve
muṁgiḍa nemiddaramu muchchaḍalāḍugom̐gā
tŏṁgisūsi nīvademi toḍugūsuṁḍeve
(||radu||)
veḍugadom̐ badivŏdda vīṇĕ ne vāyiṁcham̐gānu
joḍugāvachchinīvemi sudigūḍeve
vīḍĕmichchi tamulamu vĕsa nem̐ bĕṭṭibaṁchugom̐gā
jāḍado nīvemi sĕyisām̐sabūm̐seve
(||radu||)
alamelumaṁga nenu adam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍĕlami nīberu mari yemaṁdure
kalasĕ nādam̐ḍu nannu kāsuga nīvuṁḍidivi
sĕlimisesi nāgiṭṭĕ sĕllĕla vayidive