పల్లవి:
ఓ బావా! నా బావా! ఓ రాజా! నా రాజా!
రావి చెట్టు తిన్నే చుట్టూ , రావి చెట్టు తిన్నే చుట్టూ
రాతి బొమ్మలు చెక్కాలోయ్, ఆ రాతి బొమ్మలు చెక్కాలోయ్
మంచి బొమ్మలు చెక్కాలోయ్, నీ మల్లి బొమ్మలు చెక్కాలి
నీ మల్లి బొమ్మలు చెక్కాలి..ఈ..ఈ..ఈ
ఓ బావా! నా బావా! ఓ రాజా! నా రాజా!
ఓ పిల్లా! నా పిల్లా! ఓ మల్లీ! నా మల్లీ! ||2||
రావి చెట్టు తిన్నే చుట్టూ ||2||
రాతి బొమ్మలు చెక్కేనే, ఆ రాతి బొమ్మలు చెక్కేనే
మల్లీ బొమ్మలు చెక్కేనే, నీ పిల్లి బొమ్మలు చెక్కేను
నీ పిల్లి బొమ్మలు చెక్కేను.. ఓ..ఓ
చరణం 1:
రాతి బొమ్మలు చేసేనే, నీ కోతీ బొమ్మలు చేసేవో
ఆ కొంగ బొమ్మలు చేసేవా!
ఓ బావా, నా బావా, ఓ రాజా, నా రాజా!
రాతి బొమ్మలు చేసేనే, నీ కోతీ బొమ్మలు చేసేవో
ఆ కొంగ బొమ్మలు చేసేవా!
వేపా చెట్టూ బోదీ చుట్టూ వెర్రి బావను కట్టేరోయ్
ఆ వెర్రి బావను కట్టేరోయ్
వేపా బెత్తం పట్టేరోయ్, వీపు పగల గొట్టేరోయ్
ఆ వీపు పగల గొట్టేరు..ఊ..ఊ..ఊ!