రావే యెక్క డిసుద్ది రాఁపుసేతురా పతిని
(॥పల్లవి॥)
రావే యెక్క డిసుద్ది రాఁపుసేతురా పతిని
సేవలు చిత్తమురాను సేయఁగదవే
(॥రావే॥)
చిగురులోపలిచెఁగ చిత్తములోపలికాంక్ష
మొగములోఁగళలై మొలచెఁగదే
యెగసక్కెమాడెనటె యెఱఁగనటె నేను
మగనితో నలుకలు మానఁగదవే
(॥రావే॥)
పాలమీఁదిమీఁగడ పాయములోనిమదము
జాలువారీఁ జెమటలై చన్నులఁ గదే
యేల నీతోఁ జలమటె యిచ్చక మెఱఁగనటె
కాలుదొక్కి వుండఁగాను కాఁతాళించనేఁటికే
(॥రావే॥)
కనకముతోనవన్నె కాఁగిటిలోని ప్రియము
కనుచూపువేడుకలై కలిగిఁగదే
యెనసె శ్రీవేంకటేశు డిద్దరికిఁ జెలిఁగదే
ననుపై మీరిట్టె మీలో నవ్వఁగదరె
(||pallavi||)
rāve yĕkka ḍisuddi rām̐pusedurā padini
sevalu sittamurānu seyam̐gadave
(||rāve||)
sigurulobalisĕm̐ga sittamulobaligāṁkṣha
mŏgamulom̐gaḽalai mŏlasĕm̐gade
yĕgasakkĕmāḍĕnaḍĕ yĕṟam̐ganaḍĕ nenu
maganido nalugalu mānam̐gadave
(||rāve||)
pālamīm̐dimīm̐gaḍa pāyamulonimadamu
jāluvārīm̐ jĕmaḍalai sannulam̐ gade
yela nīdom̐ jalamaḍĕ yichchaga mĕṟam̐ganaḍĕ
kāludŏkki vuṁḍam̐gānu kām̐tāḽiṁchanem̐ṭige
(||rāve||)
kanagamudonavannĕ kām̐giḍiloni priyamu
kanusūbuveḍugalai kaligim̐gade
yĕnasĕ śhrīveṁkaḍeśhu ḍiddarigim̐ jĕlim̐gade
nanubai mīriṭṭĕ mīlo navvam̐gadarĕ