(॥పల్లవి॥)
రావయ్యా వో రావయ్యా
తావుకొని నిన్నుఁ దలఁచీని
(॥రావ॥)
చిప్పిలుఁజెమటలు చెక్కుల వెంటాఁ
గుప్పళించీ నిదె కోమలి
దప్పిదేరుచును తన పెదవుల
పిప్పిగట్ట నిన్నుఁ బిలిచీని
(॥రావ॥)
చల్లుఁబులకలు చన్నులనిండా
జల్లన నించీని జవరాలూ
వెల్లి నిట్టూర్పులువెలయ నీయింటి
కల్లదె వచ్చి ని న్నడిగీని
(॥రావ॥)
సిగ్గుల మొక్కులు చేతుల రెంటా
వొగ్గుచు నీకిచ్చీ నువిద
యెగ్గుల శ్రీవేంకటేశ నిన్నుఁ గూడి
అగ్గలపు రతు లవే కొసరీని
(||pallavi||)
rāvayyā vo rāvayyā
tāvugŏni ninnum̐ dalam̐sīni
(||rāva||)
sippilum̐jĕmaḍalu sĕkkula vĕṁṭām̐
guppaḽiṁchī nidĕ komali
dappiderusunu tana pĕdavula
pippigaṭṭa ninnum̐ bilisīni
(||rāva||)
sallum̐bulagalu sannulaniṁḍā
jallana niṁchīni javarālū
vĕlli niṭṭūrbuluvĕlaya nīyiṁṭi
kalladĕ vachchi ni nnaḍigīni
(||rāva||)
siggula mŏkkulu sedula rĕṁṭā
vŏggusu nīgichchī nuvida
yĕggula śhrīveṁkaḍeśha ninnum̐ gūḍi
aggalabu radu lave kŏsarīni