రావయ్యా లోనికి నీ రమణి నేను
(॥పల్లవి॥)
రావయ్యా లోనికి నీ రమణి నేను
సేవలెల్లాఁ జేసే నీవు చిత్తగించు మికను
(॥రావ॥)
కూరిమిసతిఁగనక కొసరితి నిఁతేకాక
సారెసారె నిన్ను దూరఁ జలమా నాకు
వోరుతువు గనక నిన్నొరసిచూచితిఁగాక
నేరములు నీపైవేయ నెపమా నాకు
(॥రావ॥)
చనవరిఁగనక నే సన్నలు సేసితిఁగాక
పనివడి జంకించఁ బంతమా నాకు
యెనలేనివేడుకల నింపులు చల్లితిఁగాక
పెనఁగి నీతో నంతబిరుదా నాకు
(॥రావ॥)
చంచులఁ గాఁగిలించఁగా చన్నుల నొత్తితిఁగాక
మించి మేలమాడ మందెమేళమా నాకు
యెంచఁగ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కొంచక కూడితి విదె గుఱుతా నాకు
(||pallavi||)
rāvayyā lonigi nī ramaṇi nenu
sevalĕllām̐ jese nīvu sittagiṁchu miganu
(||rāva||)
kūrimisadim̐ganaga kŏsaridi nim̐tegāga
sārĕsārĕ ninnu dūram̐ jalamā nāgu
voruduvu ganaga ninnŏrasisūsidim̐gāga
neramulu nībaiveya nĕbamā nāgu
(||rāva||)
sanavarim̐ganaga ne sannalu sesidim̐gāga
panivaḍi jaṁkiṁcham̐ baṁtamā nāgu
yĕnaleniveḍugala niṁpulu sallidim̐gāga
pĕnam̐gi nīdo naṁtabirudā nāgu
(||rāva||)
saṁchulam̐ gām̐giliṁcham̐gā sannula nŏttidim̐gāga
miṁchi melamāḍa maṁdĕmeḽamā nāgu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kŏṁchaga kūḍidi vidĕ guṟudā nāgu