Raavayya sooduvu ramanini

రావయ్య చూతువు రమణిని
Language

(॥పల్లవి॥)
రావయ్య చూతువు రమణిని
దేవుల కిటువంటి తెఱంగులు

(॥రావ॥)
పలచని యెలుఁగులపాటలు
చెలపలచెలపలచెమటలు
నిలువు నివ్వెరగులనీటులు
కలిగె నేఁడిదివో కలికికిని

(॥రావ॥)
సుడిగొనిన యెదురు చూపులు
వుడుకవుడక నట్టె వూరుపులు
బడిబడిఁ దిరిగేటిబాగులు
ఆడియాలమయ్య నీయంగనకు

(॥రావ॥)
చేతిలో పిడికిటిసేసలు
రాతిరిఁబగలు రతి రహస్యములు
యీతల శ్రీవేంకటేశ యెనసితివి
లాతాయ మన్ననలు లలనకును

(||pallavi||)
rāvayya sūduvu ramaṇini
devula kiḍuvaṁṭi tĕṟaṁgulu

(||rāva||)
palasani yĕlum̐gulabāḍalu
sĕlabalasĕlabalasĕmaḍalu
niluvu nivvĕragulanīḍulu
kaligĕ nem̐ḍidivo kaligikini

(||rāva||)
suḍigŏnina yĕduru sūbulu
vuḍugavuḍaga naṭṭĕ vūrubulu
baḍibaḍim̐ dirigeḍibāgulu
āḍiyālamayya nīyaṁganagu

(||rāva||)
sedilo piḍigiḍisesalu
rādirim̐bagalu radi rahasyamulu
yīdala śhrīveṁkaḍeśha yĕnasidivi
lādāya mannanalu lalanagunu