రావయ్య మా ఇంటికి రవ్వసేయ మాకేఁటికి
(॥పల్లవి॥)
రావయ్య మా ఇంటికి రవ్వసేయ మాకేఁటికి
భావించి నీ యిచ్చలోనే పరగేముగాక
(॥రావ॥)
కందువైన జవ్వనపుకాంతల కేఁటిచలము
చెంది పతికిఁ బ్రియము చెప్పేటే కాక
మందలించి సారెసారె మరియేఁటిమాటలు
పొందులు దెలిపి నీతోఁ బొసఁగుటేకాక
(॥రావ॥)
యెచ్చట మానాపతులకేల వెంగెములాడను
నిచ్చ నీసేవలు సేసి నిక్కుటగాక
పెచ్చువెరిగి యందాఁకాఁ బెనఁగఁగవచ్చు నిఁక
విచనవిడిని నిన్నే వేఁడుకొంటగాక
(॥రావ॥)
ఇట్టె వలచినదాని కింత పెనఁగఁగనేల
గుట్టున నలమేల్ మంగఁ గూడుటగాక
నెట్టన శ్రీవేంకటేశ నే నీకు నాలనే
వొట్టిననీరతులలో నోలలాడుటగాక
(||pallavi||)
rāvayya mā iṁṭigi ravvaseya māgem̐ṭigi
bhāviṁchi nī yichchalone paragemugāga
(||rāva||)
kaṁduvaina javvanabugāṁtala kem̐ṭisalamu
sĕṁdi padigim̐ briyamu sĕppeḍe kāga
maṁdaliṁchi sārĕsārĕ mariyem̐ṭimāḍalu
pŏṁdulu dĕlibi nīdom̐ bŏsam̐guḍegāga
(||rāva||)
yĕchchaḍa mānābadulagela vĕṁgĕmulāḍanu
nichcha nīsevalu sesi nikkuḍagāga
pĕchchuvĕrigi yaṁdām̐kām̐ bĕnam̐gam̐gavachchu nim̐ka
visanaviḍini ninne vem̐ḍugŏṁṭagāga
(||rāva||)
iṭṭĕ valasinadāni kiṁta pĕnam̐gam̐ganela
guṭṭuna nalamel maṁgam̐ gūḍuḍagāga
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nīgu nālane
vŏṭṭinanīradulalo nolalāḍuḍagāga