Raamuni avadaaram ravigulasomuni avadaaram...

రాముని అవతారం రవికులసోముని అవతారం...
Work
Year
Language

పల్లవి:

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో...
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో...ఓ...
రాముని అవతారం... రవికులసోముని అవతారం....

రాముని అవతారం ...రవికులసోముని అవతారం
రాముని అవతారం ...రవికులసోముని అవతారం
సుజనజనావన ధర్మాధారం...దుర్జనహృదయవిదారం ...
రాముని అవతారం

చరణం 1:

దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ...కౌసల్యాసతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు...
జన్మింతురు సహజాతులు మువ్వురు...లక్ష్మణ శత్రుఘ్న భరతా

రాముని అవతారం ...రవికులసోముని అవతారం

చరణం 2:

చదువులునేరుచు ...మిషచేత చాపముదాలిచిచేతా
విశ్వామిత్రుని వెనువెంట ...యాగముకావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము ...అంతము చేయునహల్యకు శాపము
వొసగును సుందర రూపం ...

రాముని అవతారం...రవికులసోముని అవతారం

ధనువో జనకుని మనసున భయమో...ధారుణి కన్యాసంశయమో
దనుజులుకలగను సుఖగోపురమో...
దనుజులుకలగను సుఖగోపురమో...విరిగెను మిథిలానగరమునా
రాముని అవతారం రవికులసోముని అవతారం

కపట నాటకుని పట్టాభిషేకం... కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం ... లోకోద్ధరణకు ప్రారంభం

భరతుని కోరికతీరుచుకోసం ...పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని కోరికతీరుచుకోసం ...పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికినవ నవసంతోషం ...గురుజనసేవకు ఆదేశం

రాముని అవతారం రవికులసోముని అవతారం

చరణం 3:

అదిగో చూడుము బంగరు జింకా... అదిగో చూడుము బంగరు జింకా...
మన్నైకనునయ్యో లంకా... హరనయనాగ్ని పరాంగన వంకా...
అరిగిన మరణమె నీకింకా...
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ ...వానరకుల పుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ... వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం... ముద్రిక కాదిది భువన నిదానం..
జీవన్ముక్తికి సోపానం... జీవన్ముక్తికి సోపానం

రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులశోమా...
సీతాశోక వినాశనకారి... లంకావైభవ సంహారి

అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరిత...
సమయును పరసతిపై మమకారం...వెలయును ధర్మవిచారం

రాముని అవతారం... రవికులసోముని అవతారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం

pallavi:

dvārabālura marala daridīyu kṛpayo...
dharalona dharmamu nĕlagŏlbu nĕbamo...o...
rāmuni avadāraṁ... ravigulasomuni avadāraṁ....

rāmuni avadāraṁ ...ravigulasomuni avadāraṁ
rāmuni avadāraṁ ...ravigulasomuni avadāraṁ
sujanajanāvana dharmādhāraṁ...durjanahṛdayavidāraṁ ...
rāmuni avadāraṁ

saraṇaṁ 1:

dāśharathiga śhrīgāṁtuḍu vĕlayū...kausalyāsadi tabamu phaliṁchū
janmiṁturu sahajādulu muvvuru...
janmiṁturu sahajādulu muvvuru...lakṣhmaṇa śhatrughna bharadā

rāmuni avadāraṁ ...ravigulasomuni avadāraṁ

saraṇaṁ 2:

saduvulunerusu ...miṣhaseda sābamudālisisedā
viśhvāmitruni vĕnuvĕṁṭa ...yāgamugāvaga sanunaṁṭa
aṁtamu seyunahalyagu śhābamu ...aṁtamu seyunahalyagu śhābamu
vŏsagunu suṁdara rūbaṁ ...

rāmuni avadāraṁ...ravigulasomuni avadāraṁ

dhanuvo janaguni manasuna bhayamo...dhāruṇi kanyāsaṁśhayamo
danujulugalaganu sukhagoburamo...
danujulugalaganu sukhagoburamo...virigĕnu mithilānagaramunā
rāmuni avadāraṁ ravigulasomuni avadāraṁ

kabaḍa nāḍaguni paṭṭābhiṣhegaṁ... kalugunu tātkāliga śhogaṁ
bhīgara kānana vāsāraṁbhaṁ ... logoddharaṇagu prāraṁbhaṁ

bharaduni korigadīrusugosaṁ ...pādugalŏsage premāveśhaṁ
bharaduni korigadīrusugosaṁ ...pādugalŏsage premāveśhaṁ
narajādiginava navasaṁtoṣhaṁ ...gurujanasevagu ādeśhaṁ

rāmuni avadāraṁ ravigulasomuni avadāraṁ

saraṇaṁ 3:

adigo sūḍumu baṁgaru jiṁkā... adigo sūḍumu baṁgaru jiṁkā...
mannaiganunayyo laṁkā... haranayanāgni parāṁgana vaṁkā...
arigina maraṇamĕ nīgiṁkā...
rammu rammu he bhāgavadottama ...vānaragula puṁgava hanumā
rammu rammu he bhāgavadottama... vānaragula puṁgava hanumā
mudriga kādidi bhuvana nidānaṁ... mudriga kādidi bhuvana nidānaṁ..
jīvanmuktigi sobānaṁ... jīvanmuktigi sobānaṁ

rāma rāma jaya rāma rāma jaya rāma rāma raghugulaśhomā...
sīdāśhoga vināśhanagāri... laṁkāvaibhava saṁhāri

ayyo rāvaṇa bhaktāgresara amaraṁbauniga nī sarida...
samayunu parasadibai mamagāraṁ...vĕlayunu dharmavisāraṁ

rāmuni avadāraṁ... ravigulasomuni avadāraṁ
rāmuni avadāraṁ... ravigulasomuni avadāraṁ