రాముఁ డీతఁడు లోకాభిరాముఁ డీతఁడు
(॥పల్లవి॥)
రాముఁ డీతఁడు లోకాభిరాముఁ డీతఁడు
కామించిన విభీషణుఁ గాచినవాఁ డీతఁడు
(॥రాముఁ॥)
శ్రీదైవారినయట్టి సీతారాముఁ డీతఁడు
కోదండ దీక్షా గురుఁ డీతఁడు
మోదమున నబ్ధి యమ్ముమొనకుఁ దెచ్చె నీతఁడు
పాదుకొని సుగ్రీవు పగ దీర్చె నీతఁడు
(॥రాముఁ॥)
ఘోర రావణుని తలగుండు గండఁడీతఁడు
వీరాధి వీరుఁడైన విష్ణుఁ డీతఁడు
చేరి యయోధ్యాపతియై చెలఁగినవాఁ డీతఁడు
ఆరూఢి మునుల కభయము లిచ్చె నీతఁడు
(॥రాముఁ॥)
తగ నందరిపాలిటి తారకబ్రహ్మ మీతఁడు
నిగమములు నుతించే నిత్యుఁ డీతఁడు
జగములో శ్రీవేంకటేశ్వరుఁడైనవాఁ డీతఁడు
పగటున లోకమెల్లాఁ బాలించె నీతఁడు
(||pallavi||)
rāmum̐ ḍīdam̐ḍu logābhirāmum̐ ḍīdam̐ḍu
kāmiṁchina vibhīṣhaṇum̐ gāsinavām̐ ḍīdam̐ḍu
(||rāmum̐||)
śhrīdaivārinayaṭṭi sīdārāmum̐ ḍīdam̐ḍu
kodaṁḍa dīkṣhā gurum̐ ḍīdam̐ḍu
modamuna nabdhi yammumŏnagum̐ dĕchchĕ nīdam̐ḍu
pādugŏni sugrīvu paga dīrsĕ nīdam̐ḍu
(||rāmum̐||)
ghora rāvaṇuni talaguṁḍu gaṁḍam̐ḍīdam̐ḍu
vīrādhi vīrum̐ḍaina viṣhṇum̐ ḍīdam̐ḍu
seri yayodhyābadiyai sĕlam̐ginavām̐ ḍīdam̐ḍu
ārūḍhi munula kabhayamu lichchĕ nīdam̐ḍu
(||rāmum̐||)
taga naṁdaribāliḍi tāragabrahma mīdam̐ḍu
nigamamulu nudiṁche nityum̐ ḍīdam̐ḍu
jagamulo śhrīveṁkaḍeśhvarum̐ḍainavām̐ ḍīdam̐ḍu
pagaḍuna logamĕllām̐ bāliṁchĕ nīdam̐ḍu