(॥పల్లవి॥)
రామా రామా రాజీవనయనా
కామించి నినుఁ జూచె గక్కన మా చెలియ
(॥రామా॥)
యింతి పిలువనంపె నెడమాటలేలా
యింతలో విచ్చేయు ఎన్నికగాక
చెంత నిందులకుఁగా సెలవి నవ్వేలా
పంతముతో నాకెఁ బాలింతు గాక
(॥రామా॥)
తరుణి పూవుల వేసె తలవంచనేలా
సరినీవు మోహమే చల్లుదుగాక
నిరతి నిందుకుఁగా నివ్వెరగేలా
మరిగి యాకెను నీవే మన్నింతుగాక
(॥రామా॥)
మగువ కాఁగిటఁ గూడె మరి సిగ్గులేలా
వెగటురతుల విఱ్ఱమీఁగుదుగాక
వగల శ్రీ వేంకటేశ వావిలిపాటిరామ
మిగుల సీతతో మెఱుతువుగాక
(||pallavi||)
rāmā rāmā rājīvanayanā
kāmiṁchi ninum̐ jūsĕ gakkana mā sĕliya
(||rāmā||)
yiṁti piluvanaṁpĕ nĕḍamāḍalelā
yiṁtalo vichcheyu ĕnnigagāga
sĕṁta niṁdulagum̐gā sĕlavi navvelā
paṁtamudo nāgĕm̐ bāliṁtu gāga
(||rāmā||)
taruṇi pūvula vesĕ talavaṁchanelā
sarinīvu mohame salludugāga
niradi niṁdugum̐gā nivvĕragelā
marigi yāgĕnu nīve manniṁtugāga
(||rāmā||)
maguva kām̐giḍam̐ gūḍĕ mari siggulelā
vĕgaḍuradula viṭramīm̐gudugāga
vagala śhrī veṁkaḍeśha vāvilibāḍirāma
migula sīdado mĕṟuduvugāga