రాతిఁ బతిమ సేసిన రామచంద్ర నీ
(॥పల్లవి॥)
రాతిఁ బతిమ సేసిన రామచంద్ర నీ-
చేతిలోనిదాన నింతే శ్రీరామచంద్ర
(॥రాతిఁ॥)
వట్టిరట్టు సేయ కిఁక వద్దు రామచంద్ర
నెట్టన నే దూరనోప నిను రామచంద్ర
వొట్టితిఁ బ్రేమము నీపై వో రామచంద్ర మమ్ము
వట్టిజాలిఁ బెట్ట కిఁక వద్దు రామచంద్ర
(॥రాతిఁ॥)
విన్నపాలు వేయునేల విను రామచంద్ర మా-
కన్నులకు నీవె గురి ఘనరామచంద్ర
యెన్నిక నన్నుఁ బాయకు మిఁక రామచంద్ర
నిన్ను నన్ను నెంచుకొమ్మీ నీవు రామచంద్ర
(॥రాతిఁ॥)
ఆయము లంటితివి నెయ్యపురామచంద్ర వొక్క-
పాయమే ఇద్దరికిని బలురామచంద్ర
ఆయెడ వావిలిపాటి హరిరామచంద్ర
చేయార శ్రీ వేంకటాద్రిఁ జెందితి రామచంద్ర
(||pallavi||)
rādim̐ badima sesina rāmasaṁdra nī-
sedilonidāna niṁte śhrīrāmasaṁdra
(||rādim̐||)
vaṭṭiraṭṭu seya kim̐ka vaddu rāmasaṁdra
nĕṭṭana ne dūranoba ninu rāmasaṁdra
vŏṭṭidim̐ bremamu nībai vo rāmasaṁdra mammu
vaṭṭijālim̐ bĕṭṭa kim̐ka vaddu rāmasaṁdra
(||rādim̐||)
vinnabālu veyunela vinu rāmasaṁdra mā-
kannulagu nīvĕ guri ghanarāmasaṁdra
yĕnniga nannum̐ bāyagu mim̐ka rāmasaṁdra
ninnu nannu nĕṁchugŏmmī nīvu rāmasaṁdra
(||rādim̐||)
āyamu laṁṭidivi nĕyyaburāmasaṁdra vŏkka-
pāyame iddarigini balurāmasaṁdra
āyĕḍa vāvilibāḍi harirāmasaṁdra
seyāra śhrī veṁkaḍādrim̐ jĕṁdidi rāmasaṁdra