Raa raa krshnayya

రా రా కృష్ణయ్య
Work
Year
Language

పల్లవి:

దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడూ
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నమూ వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా

రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా.....

చరణం 1:

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
అజ్ఞానపు చీకటికీ దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా... నీవే కృష్ణా... నీవే కృష్ణా

రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా..... రా రా కృష్ణయ్యా

చరణం 2:

కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం... దేవుని.. సన్నిధానం.. సన్నిధానం

రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా.....
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా

చరణం 3:

కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా

కృష్ణా కృష్ణా రా రా కృష్ణా

రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా

pallavi:

dīnula kābāḍuḍagu devuḍe unnāḍū
devuni namminavāḍu ĕnnaḍū sĕḍiboḍu
āgaligi annamū vedanagu auṣhadhaṁ
paramātmuni sannidhigi rāve o manasā

rā rā kṛṣhṇayyā rā rā kṛṣhṇayyā
dīnulanu kābāḍā rā rā kṛṣhṇayyā
rā rā kṛṣhṇayyā rā rā kṛṣhṇayyā
dīnulanu kābāḍā rā rā kṛṣhṇayyā
rā rā kṛṣhṇayyā rā rā.....

saraṇaṁ 1:

mā pāliḍi ilavelubu nīvenayyā ĕdurusūsu kannulalo kadilevayyā
mā pāliḍi ilavelubu nīvenayyā ĕdurusūsu kannulalo kadilevayyā
pedalamŏralāliṁche vibhuḍavu nīve korina varamulanŏsage varaduḍa vīve
pedalamŏralāliṁche vibhuḍavu nīve korina varamulanŏsage varaduḍa vīve
ajñānabu sīgaḍigī dībamu nīve anyāyamunĕdiriṁche dharmamu nīve
nīve kṛṣhṇā... nīve kṛṣhṇā... nīve kṛṣhṇā

rā rā kṛṣhṇayyā rā rā kṛṣhṇayyā
dīnulanu kābāḍā rā rā kṛṣhṇayyā
rā rā kṛṣhṇayyā..... rā rā kṛṣhṇayyā

saraṇaṁ 2:

kuṁṭivāni naḍibiṁche bṛṁdāvanaṁ gruḍḍivāḍu sūḍagalugu bṛṁdāvanaṁ
kuṁṭivāni naḍibiṁche bṛṁdāvanaṁ gruḍḍivāḍu sūḍagalugu bṛṁdāvanaṁ
mūḍhunigī jñānamŏsagu bṛṁdāvanaṁ mūgavāni paligiṁche bṛṁdāvanaṁ
mūḍhunigī jñānamŏsagu bṛṁdāvanaṁ mūgavāni paligiṁche bṛṁdāvanaṁ
aṁdarinī ādariṁchu sannidhānaṁ abhayamichchi dīviṁche sannidhānaṁ
sannidhānaṁ... devuni.. sannidhānaṁ.. sannidhānaṁ

rā rā kṛṣhṇayyā rā rā kṛṣhṇayyā
dīnulanu kābāḍā rā rā kṛṣhṇayyā
rā rā kṛṣhṇayyā.....
kṛṣhṇā kṛṣhṇā rā rā kṛṣhṇā

saraṇaṁ 3:

karuṇiṁche sūbulado kāṁchavayyā śharaṇŏsage karamulado kāvavayyā
karuṇiṁche sūbulado kāṁchavayyā śharaṇŏsage karamulado kāvavayyā
mūgavāni paligiṁchi brovavayyā kannadalli svargamulo murisenayyā
mūgavāni paligiṁchi brovavayyā kannadalli svargamulo murisenayyā
ninnu sūsi bādhalanni marisenayyā ādhāramu nīverā rā rā kṛṣhṇā
ninnu sūsi bādhalanni marisenayyā ādhāramu nīverā rā rā kṛṣhṇā

kṛṣhṇā kṛṣhṇā rā rā kṛṣhṇā

rā rā kṛṣhṇayyā rā rā kṛṣhṇayyā
dīnulanu kābāḍā rā rā kṛṣhṇayyā
rā rā kṛṣhṇayyā rā rā kṛṣhṇayyā