Puvvu navvenu punnami navvenu

పువ్వు నవ్వెను పున్నమి నవ్వెను
Year
Language

పల్లవి:

పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...పులకరించి ఈ జగమూ నవ్వెను
కొలను నవ్వెను.. కోరిక నవ్వెను ..నవ్వలేక నేనున్నాను...
పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను..

చరణం 1:

వయసు నవ్వెను.. సొగసూ నవ్వెను.. నవ్వు రాక ఈ మనసే నలిగెను
వయసు నవ్వెను.. సొగసూ నవ్వెను.. నవ్వు రాక ఈ మనసే నలిగెను
వలపు నవ్వెను.. తలపూ నవ్వెను.. పగరగిలీ అవి బలి అయిపోయెను

పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...నవ్వలేక నేనున్నాను...

చరణం 2:

కడుపుతీపితో కన్నబిడ్డకై హితము కోరి ఏగిన తండ్రికి
చేయని నేరము శిక్ష వేసెను మాయని పాపం శాపాలాయెను ...

పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...నవ్వలేక నేనున్నాను...

చరణం 3:

కలిమి చెలిమి వెలసిన ఇల్లు ...వెలుగు మాసి వెలవెలపోయెను
కలిమి చెలిమి వెలసిన ఇల్లు ...వెలుగు మాసి వెలవెలబోయెను
లోకం నవ్వెను ..శోకం మిగిలెను.. లోలోపల నా గుండెలవిసెను

పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...నవ్వలేక నేనున్నాను...నవ్వలేక నేనున్నాను

pallavi:

puvvu navvĕnu.. punnami navvĕnu...pulagariṁchi ī jagamū navvĕnu
kŏlanu navvĕnu.. koriga navvĕnu ..navvalega nenunnānu...
puvvu navvĕnu.. punnami navvĕnu..

saraṇaṁ 1:

vayasu navvĕnu.. sŏgasū navvĕnu.. navvu rāga ī manase naligĕnu
vayasu navvĕnu.. sŏgasū navvĕnu.. navvu rāga ī manase naligĕnu
valabu navvĕnu.. talabū navvĕnu.. pagaragilī avi bali ayiboyĕnu

puvvu navvĕnu.. punnami navvĕnu...navvalega nenunnānu...

saraṇaṁ 2:

kaḍubudībido kannabiḍḍagai hidamu kori egina taṁḍrigi
seyani neramu śhikṣha vesĕnu māyani pābaṁ śhābālāyĕnu ...

puvvu navvĕnu.. punnami navvĕnu...navvalega nenunnānu...

saraṇaṁ 3:

kalimi sĕlimi vĕlasina illu ...vĕlugu māsi vĕlavĕlaboyĕnu
kalimi sĕlimi vĕlasina illu ...vĕlugu māsi vĕlavĕlaboyĕnu
logaṁ navvĕnu ..śhogaṁ migilĕnu.. lolobala nā guṁḍĕlavisĕnu

puvvu navvĕnu.. punnami navvĕnu...navvalega nenunnānu...navvalega nenunnānu