Puttaga tolle yenni boomeladaana vaidivi

పుట్టక తొల్లె యెన్ని బూమెలదాన వైతివి
Language

(॥పల్లవి॥)
పుట్టక తొల్లె యెన్ని బూమెలదాన వైతివి
దట్టపు నీ కోరికలు తలఁచినట్టాయెనే

(॥పుట్ట॥)
కప్పురాన లేసేవు కాఁగిటికి లాసేవు
వుప్పతిల్లి పతిమీఁద నొల వేసేవు
చెప్పరాదె నీ పగటు చేఁత లంతకూ వెగటు
ఇప్పుడు నీ నేరుపులు యేమని చెప్పుదునే

(॥పుట్ట॥)
కొచ్చి కొచ్చి దూరేవు కొనగోర గీరేవు
పచ్చిగా నవ్వి పానుపుపైకిఁ జేరేవు
మెచ్చిరే నీ సుద్దులు మేరమీరె నీ బుద్దులు
చెచ్చెర నీ గుణములు చెప్పఁ గతలాయెనే

(॥పుట్ట॥)
మురిపేన సొలసేవు ముందరనే పొలసేవు
గరిమ నానారతుల గలసేవు
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
విరువులై నీ గుణాలు వెల్లవిరులాయెనే

(||pallavi||)
puṭṭaga tŏllĕ yĕnni būmĕladāna vaidivi
daṭṭabu nī korigalu talam̐sinaṭṭāyĕne

(||puṭṭa||)
kappurāna lesevu kām̐giḍigi lāsevu
vuppadilli padimīm̐da nŏla vesevu
sĕpparādĕ nī pagaḍu sem̐ta laṁtagū vĕgaḍu
ippuḍu nī nerubulu yemani sĕppudune

(||puṭṭa||)
kŏchchi kŏchchi dūrevu kŏnagora gīrevu
pachchigā navvi pānububaigim̐ jerevu
mĕchchire nī suddulu meramīrĕ nī buddulu
sĕchchĕra nī guṇamulu sĕppam̐ gadalāyĕne

(||puṭṭa||)
muribena sŏlasevu muṁdarane pŏlasevu
garima nānāradula galasevu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
viruvulai nī guṇālu vĕllavirulāyĕne