పురుషవిరహ మిదె పొలఁతి నీ మగనికి
(॥పల్లవి॥)
పురుషవిరహ మిదె పొలఁతి నీ మగనికి
గరిమతో నిండుకొనెఁ గాఁగిలించఁగదవే
(॥పురు॥)
పెలుచుఁదనాన నీవు పెడచేత మొక్కినదే
తలఁచుకరమణుఁడు తమకించునే
కలకల నవ్వుతా కన్నులఁజేచినదే
చెలరెఁగి అండనున్న చెలులకుఁ జెప్పునే
(॥పురు॥)
మందెమేళమున నీవు మాలాడినవి యెల్ల
అంది కలవరించేటియప్పు డాడునే
దమంటాఁ గుపనిడెమిచ్చినయలవాటున
చెంది యిట్టె సారెసారెఁ జేయి చాఁచునే
(॥పురు॥)
చెక్కు నొక్కి యేకతానఁ జెనకి కూడినందుకే
చొక్కుచు వానందాన సుముఖుఁడౌనె
ఇక్కడ శ్రీవేంకటేశు నెనసితి వింతలోనె
యెక్కువ నిందాఁకారను యెదురులు చూచెనే
(||pallavi||)
puruṣhaviraha midĕ pŏlam̐ti nī maganigi
garimado niṁḍugŏnĕm̐ gām̐giliṁcham̐gadave
(||puru||)
pĕlusum̐danāna nīvu pĕḍaseda mŏkkinade
talam̐sugaramaṇum̐ḍu tamagiṁchune
kalagala navvudā kannulam̐jesinade
sĕlarĕm̐gi aṁḍanunna sĕlulagum̐ jĕppune
(||puru||)
maṁdĕmeḽamuna nīvu mālāḍinavi yĕlla
aṁdi kalavariṁcheḍiyappu ḍāḍune
damaṁṭām̐ gubaniḍĕmichchinayalavāḍuna
sĕṁdi yiṭṭĕ sārĕsārĕm̐ jeyi sām̐sune
(||puru||)
sĕkku nŏkki yegadānam̐ jĕnagi kūḍinaṁduge
sŏkkusu vānaṁdāna sumukhum̐ḍaunĕ
ikkaḍa śhrīveṁkaḍeśhu nĕnasidi viṁtalonĕ
yĕkkuva niṁdām̐kāranu yĕdurulu sūsĕne