పున్నాగ పూలతోటలో మాట ఇచ్చి మరువకు
పల్లవి:
పున్నాగ పూలతోటలో మాట ఇచ్చి మరువకు
మాట ఇచ్చి మరువకు
అందాల గువ్వ చేతిలో చేయి వేసి వదలకు
చేయి వేసి వదలకు
నీలాల నింగే సాక్షి నా మాట మరువనే
ఏడేడు జన్మల్లోనా నీ చేయి విడువనే || పున్నాగ ||
చరణం 1:
వెండి మబ్బు జాడలో తేలి ఆడే పావురం
గుండెపైన వాలితే చెప్పలేని సంబరం
మావిచివురులు కొసరినా కోయిలా మురిపించకే
తేనె రుచులను మరిగిన తుమ్మెదా కవ్వించకే
పాల వెన్నెల్లో భామ పొంగిపోయిందే ప్రేమ కంటి రెప్పల్లో ఊయలూగవే
పున్నాగ పూలతోటలో...
మాట ఇచ్చి మరువను
మాట ఇచ్చి మరువను
అందాల గువ్వ చేతిలో...
చేయి వేసి వదలను
చేయి వేసి వదలను
చరణం 2:
చల్లగాలి తరగనై గుండెలో నిదురించనా
కంచిపట్టు చీరనై ఒంటినే పెనవేయనా
మెరుపు వెలుగుల మగసిరి వలపులను కురిపించకే
అణువు అణువున సొగసరి అధరసుధలొలికించవే
నిండు కౌగిట్లో చేరి దొంగముద్దెట్టి కొట్టి నా సిగ్గంతా తీయమాకురో ॥
పున్నాగ పూలతోటలో మాట ఇచ్చి మరువకు
మాట ఇచ్చి మరువకు
అందాల గువ్వ చేతిలో చేయి వేసి వదలకు
చేయి వేసి వదలకు
నీలాల నింగే సాక్షి నా మాట మరువకు
ఏడేడు జన్మల్లోనా నా చేయి విడువకు
pallavi:
punnāga pūladoḍalo māḍa ichchi maruvagu
māḍa ichchi maruvagu
aṁdāla guvva sedilo seyi vesi vadalagu
seyi vesi vadalagu
nīlāla niṁge sākṣhi nā māḍa maruvane
eḍeḍu janmallonā nī seyi viḍuvane || punnāga ||
saraṇaṁ 1:
vĕṁḍi mabbu jāḍalo teli āḍe pāvuraṁ
guṁḍĕbaina vālide sĕppaleni saṁbaraṁ
māvisivurulu kŏsarinā koyilā muribiṁchage
tenĕ rusulanu marigina tummĕdā kavviṁchage
pāla vĕnnĕllo bhāma pŏṁgiboyiṁde prema kaṁṭi rĕppallo ūyalūgave
punnāga pūladoḍalo...
māḍa ichchi maruvanu
māḍa ichchi maruvanu
aṁdāla guvva sedilo...
seyi vesi vadalanu
seyi vesi vadalanu
saraṇaṁ 2:
sallagāli taraganai guṁḍĕlo niduriṁchanā
kaṁchibaṭṭu sīranai ŏṁṭine pĕnaveyanā
mĕrubu vĕlugula magasiri valabulanu kuribiṁchage
aṇuvu aṇuvuna sŏgasari adharasudhalŏligiṁchave
niṁḍu kaugiṭlo seri dŏṁgamuddĕṭṭi kŏṭṭi nā siggaṁtā tīyamāguro ||
punnāga pūladoḍalo māḍa ichchi maruvagu
māḍa ichchi maruvagu
aṁdāla guvva sedilo seyi vesi vadalagu
seyi vesi vadalagu
nīlāla niṁge sākṣhi nā māḍa maruvagu
eḍeḍu janmallonā nā seyi viḍuvagu