పులుఁగునెక్కేటి పెద్దబొమ్మెలవాఁడు
(॥పల్లవి॥)
పులుఁగునెక్కేటి పెద్దబొమ్మెలవాఁడు
కలికిచేఁతల నించీఁ గానరటే మీరు
(॥పులు॥)
పామునాడించినయట్టిబాలజోగిపిన్నవాఁడు
వాములవెన్నలుదినేవలుకాఁడు
చేముంచి కొండలెత్తేసిద్ధవిద్యలవాఁడు
కామినులాల వచ్చెఁ గానరటే మీరు
(॥పులు॥)
పొంచినరాకాసిఁ జంపి భూతనాథుడైనవాఁడు
పెంచెము గట్టుక వెరపించేవాఁడు
అంచెల విప్రవినోదై తిరిగేటివాఁడు
కంచుమిఁచై తిరిగాడీఁ గానరటే మీరు
(॥పులు॥)
విడివిడిచేతులతో విద్యములయాటవాఁడు
అడవిఁగాచేటిగంగ్యావులవాఁడు
చెడనివరములిచ్చే శ్రీవేంకటాద్రివాఁడు
కడు నెందు చనె వీనిఁ గానరటే మీరు
(||pallavi||)
pulum̐gunĕkkeḍi pĕddabŏmmĕlavām̐ḍu
kaligisem̐tala niṁchīm̐ gānaraḍe mīru
(||pulu||)
pāmunāḍiṁchinayaṭṭibālajogibinnavām̐ḍu
vāmulavĕnnaludinevalugām̐ḍu
semuṁchi kŏṁḍalĕttesiddhavidyalavām̐ḍu
kāminulāla vachchĕm̐ gānaraḍe mīru
(||pulu||)
pŏṁchinarāgāsim̐ jaṁpi bhūdanāthuḍainavām̐ḍu
pĕṁchĕmu gaṭṭuga vĕrabiṁchevām̐ḍu
aṁchĕla vipravinodai tirigeḍivām̐ḍu
kaṁchumim̐sai tirigāḍīm̐ gānaraḍe mīru
(||pulu||)
viḍiviḍisedulado vidyamulayāḍavām̐ḍu
aḍavim̐gāseḍigaṁgyāvulavām̐ḍu
sĕḍanivaramulichche śhrīveṁkaḍādrivām̐ḍu
kaḍu nĕṁdu sanĕ vīnim̐ gānaraḍe mīru