Puchchaabuvvula

పుచ్చాపువ్వుల
Work
Year
Language

పల్లవి:

పుచ్చాపువ్వుల విచ్చేతావుల వెచ్చా వెన్నెలలూ
పచ్చా మీగడలిచ్చే తియ్యన తెచ్చే నీకలలూ
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

ముద్దాబంతులు మునిగోరింటలు మురిసే సంధ్యల్లో
పొద్దే ఎరుగని ముద్దే తరగని రసనారింజల్లో
వచ్చినాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

చరణం 1:

గువ్వ జంటలకు కువకువ ఇటు కుర్ర గుండెలకు మెళకువ
వీణ మీటె సెలయేరు చలి వేణువూదె చిరుగాలీ
కలువ కనులలోనా కలవరింతలాయే
చలువ తనువులోనా జలదరింతలాయే
ఓ ఓ ఓ ఓ....
పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ ఇసకల్లో
తెల్లా మబ్బులు వెల్లా వేసిన పిల్లకాలువల్లో
వచ్చీనాయమ్మా వచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా అలజడులొచ్చీనాయమ్మా

చరణం 2:

లేతపచ్చికల అణకువ నునులేత మచ్చికల తొణకువ
నిండు అల్లికల నవనవ తలదిండు మల్లికల శివశివ
పట్టపగటి ఎండా పండువెన్నెలాయే
నిట్టనిలువు తపనే నిలువనీయదాయే
ఓ ఓ ఓ ఓ.....
ఓరావాకిలి తీసీతీయని దోరా వయసుల్లో
మాఘామాసపు మంచూ బెబ్బులి పొంచేవేళల్లో
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా

వచ్చీనాయమ్మా వలపులు విచ్చీనాయమ్మా

పుచ్చాపువ్వుల విచ్చేతావుల వెచ్చా వెన్నెలలూ
పచ్చా మీగడలిచ్చే తియ్యన తెచ్చే నీకలలూ
వచ్చీనాయమ్మా విచ్చీనాయమ్మా
వచ్చీనాయమ్మా కలువలు విచ్చీనాయమ్మా

pallavi:

puchchābuvvula vichchedāvula vĕchchā vĕnnĕlalū
pachchā mīgaḍalichche tiyyana tĕchche nīgalalū
vachchīnāyammā vichchīnāyammā
vachchīnāyammā kaluvalu vichchīnāyammā

muddābaṁtulu munigoriṁṭalu murise saṁdhyallo
pŏdde ĕrugani mudde taragani rasanāriṁjallo
vachchināyammā vichchīnāyammā
vachchīnāyammā kaluvalu vichchīnāyammā

saraṇaṁ 1:

guvva jaṁṭalagu kuvaguva iḍu kurra guṁḍĕlagu mĕḽaguva
vīṇa mīḍĕ sĕlayeru sali veṇuvūdĕ sirugālī
kaluva kanulalonā kalavariṁtalāye
saluva tanuvulonā jaladariṁtalāye
o o o o....
piṁḍī vĕnnĕla vaṁḍī vārsina vĕṁḍī isagallo
tĕllā mabbulu vĕllā vesina pillagāluvallo
vachchīnāyammā vachchīnāyammā
vachchīnāyammā alajaḍulŏchchīnāyammā

saraṇaṁ 2:

ledabachchigala aṇaguva nunuleda machchigala tŏṇaguva
niṁḍu alligala navanava taladiṁḍu malligala śhivaśhiva
paṭṭabagaḍi ĕṁḍā paṁḍuvĕnnĕlāye
niṭṭaniluvu tabane niluvanīyadāye
o o o o.....
orāvāgili tīsīdīyani dorā vayasullo
māghāmāsabu maṁchū bĕbbuli pŏṁcheveḽallo
vachchīnāyammā vichchīnāyammā

vachchīnāyammā valabulu vichchīnāyammā

puchchābuvvula vichchedāvula vĕchchā vĕnnĕlalū
pachchā mīgaḍalichche tiyyana tĕchche nīgalalū
vachchīnāyammā vichchīnāyammā
vachchīnāyammā kaluvalu vichchīnāyammā