Priyamuseppede melu bigiyanemtigi

ప్రియముచెప్పేదే మేలు బిగియనేఁటికి
Language

(॥పల్లవి॥)
ప్రియముచెప్పేదే మేలు బిగియనేఁటికి
క్రియగూడు మా మాటలఁ గృప సేయవయ్యా

(॥ప్రియ॥)
పంతగారిసతి నిన్ను బట్టినదెల్లాఁ దప్పే
యెంతని వుత్తరమిచ్చేవేమయ్యా
వింతగా చేతులువట్టి వేఁడుకొని విడెమిచ్చి
పొంతనే యేకతమాడి బుజ్జగించవయ్యా

(॥ప్రియ॥)
చెందిన వాసికత్తె సేసినదెల్లాఁ జేఁతే
యెందాఁకాఁ దారుకాణించే వేమయ్యా
కందున నవ్వులు నవ్వి కడుఁ బచ్చడము గప్పి
ఇందరిలో గారవించిఇచ్చలాడవయ్యా

(॥ప్రియ॥)
మానవతులైన వారిమాటలెల్లాఁ గదవులే
ఆనలేల పెట్టుకొనే నదేమయ్య
ఔను కడపరాయఁడవై శ్రీవేంకటేశుఁడ
తానకమై దూరితిని దండనుండవయ్యా

(||pallavi||)
priyamusĕppede melu bigiyanem̐ṭigi
kriyagūḍu mā māḍalam̐ gṛpa seyavayyā

(||priya||)
paṁtagārisadi ninnu baṭṭinadĕllām̐ dappe
yĕṁtani vuttaramichchevemayyā
viṁtagā seduluvaṭṭi vem̐ḍugŏni viḍĕmichchi
pŏṁtane yegadamāḍi bujjagiṁchavayyā

(||priya||)
sĕṁdina vāsigattĕ sesinadĕllām̐ jem̐te
yĕṁdām̐kām̐ dārugāṇiṁche vemayyā
kaṁduna navvulu navvi kaḍum̐ bachchaḍamu gappi
iṁdarilo gāraviṁchiichchalāḍavayyā

(||priya||)
mānavadulaina vārimāḍalĕllām̐ gadavule
ānalela pĕṭṭugŏne nademayya
aunu kaḍabarāyam̐ḍavai śhrīveṁkaḍeśhum̐ḍa
tānagamai dūridini daṁḍanuṁḍavayyā