Priyamettainaa numdanee pempagu naa ramanuni

ప్రియమెట్టైనా నుండనీ పెంపగు నా రమణుని
Language

(॥పల్లవి॥)
ప్రియమెట్టైనా నుండనీ పెంపగు నా రమణుని
క్రియ నాచేఁ దగిలెను గెలిచితిఁ జింత

(॥పయ్ర॥)
పాయమెట్టైనాఁగానీ పంత మెట్టేనాఁగానీ
కాయమిచ్చితిఁ దనకుఁ గలదా చింత
చాయలకే నడవనీ సన్నలకే తిరుగనీ
చేయి దనపయినే వేసితి నేల చింత

(॥పయ్ర॥)
మనసెందైనాఁ బెట్టనీ మాఁట లెంతేశాడనీ
వునికై వొద్దనుందాన నున్నదా చింత
పనులెట్టయినాఁ గానీ భావమేదయినాఁగానీ
చెనకితిఁగాన గోరసేయ నేల చింత

(॥పయ్ర॥)
చూపు లేడఁ బారనీ సోలపెంత మీరవీ
పై పైఁ గాఁగిలించితిఁ బాసెఁగా చింత
యేపున శ్రీవేంకటేశుఁ డెన్ని కెగా నన్నుఁ గూడె
తీపుమోవి నాకుఁ జిక్కెఁ దేరె నెల్లచింత

(||pallavi||)
priyamĕṭṭainā nuṁḍanī pĕṁpagu nā ramaṇuni
kriya nāsem̐ dagilĕnu gĕlisidim̐ jiṁta

(||payra||)
pāyamĕṭṭainām̐gānī paṁta mĕṭṭenām̐gānī
kāyamichchidim̐ danagum̐ galadā siṁta
sāyalage naḍavanī sannalage tiruganī
seyi danabayine vesidi nela siṁta

(||payra||)
manasĕṁdainām̐ bĕṭṭanī mām̐ṭa lĕṁteśhāḍanī
vunigai vŏddanuṁdāna nunnadā siṁta
panulĕṭṭayinām̐ gānī bhāvamedayinām̐gānī
sĕnagidim̐gāna goraseya nela siṁta

(||payra||)
sūbu leḍam̐ bāranī solabĕṁta mīravī
pai paim̐ gām̐giliṁchidim̐ bāsĕm̐gā siṁta
yebuna śhrīveṁkaḍeśhum̐ ḍĕnni kĕgā nannum̐ gūḍĕ
tībumovi nāgum̐ jikkĕm̐ derĕ nĕllasiṁta