ప్రియమంత గలిగితే పెండ్లాడుమనవే
(॥పల్లవి॥)
ప్రియమంత గలిగితే పెండ్లాడుమనవే
నయగారివాఁడు తాను నన్నేల తడవీనే
(॥పయ్ర॥)
చిన్నదాన నన్నునేల సిగ్గువరచీనే తాను
చన్నులేల ముట్టీనే సారెసారెకు
కిన్నెర వాయించవచ్చీ కేలుమొగిచితే నన్ను
సన్నలనే మోవిచూపి జాణతనాలాడీనే
(॥పయ్ర॥)
గుట్టుతోడిదాన నన్ను గొరనేల గీరీనే
యిట్టే యిందరిముందరానేల నవ్వీనే
చుట్టపువాఁడంటాఁ దన్నుఁ జూడఁగా నే వచ్చితేను
వట్టిగిలిగింతలను వలపు రేఁచీనే
(॥పయ్ర॥)
కొమలపుదాన నాతోఁ గొరియెంత పెనఁగీనే
సాము లెంతసేసీనే సమరతుల
ఆముక శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవిభుఁడు
యీమేరల నన్ను గూడి యింపులు పుట్టించెనే
(||pallavi||)
priyamaṁta galigide pĕṁḍlāḍumanave
nayagārivām̐ḍu tānu nannela taḍavīne
(||payra||)
sinnadāna nannunela sigguvarasīne tānu
sannulela muṭṭīne sārĕsārĕgu
kinnĕra vāyiṁchavachchī kelumŏgiside nannu
sannalane movisūbi jāṇadanālāḍīne
(||payra||)
guṭṭudoḍidāna nannu gŏranela gīrīne
yiṭṭe yiṁdarimuṁdarānela navvīne
suṭṭabuvām̐ḍaṁṭām̐ dannum̐ jūḍam̐gā ne vachchidenu
vaṭṭigiligiṁtalanu valabu rem̐sīne
(||payra||)
kŏmalabudāna nādom̐ gŏriyĕṁta pĕnam̐gīne
sāmu lĕṁtasesīne samaradula
āmuga śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavibhum̐ḍu
yīmerala nannu gūḍi yiṁpulu puṭṭiṁchĕne