ప్రేమా ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు#
పల్లవి:
ప్రేమా ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
ఇన్నాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తోంది
ప్రేమా ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
చరణం 1:
పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకూ
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటి చెరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లే నా చెలి మందారం
ఎంత చేరువై వుంటే అంత సంబరం
ప్రేమా ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ...
చరణం 2:
ఏటిలో తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతోంది
కంటికి కునుకంటూ రాను పొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటోంది
ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం
వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవం
ప్రేమా ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
ఇన్నాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తోంది
ప్రేమా ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ...
pallavi:
premā ĕṁduganī nenaṁṭe aṁta prema nīgu
kammani kalalannī nijamayye kānugichchināvu
innāḽḽagu dŏrigiṁdi o sĕli snehaṁ
ibuḍe adi kānuṁdi tīyani baṁdhaṁ
śhubhalekhalu paṁpe maṁchi muhūrdaṁ paruguna vastoṁdi
premā ĕṁduganī nenaṁṭe aṁta prema nīgu
kammani kalalannī nijamayye kānugichchināvu
saraṇaṁ 1:
pāḍalā vinibiṁche āmĕ pradi palugu
haṁsalā kadilŏchche aṁdāla ā kulugū
vĕnnĕle aligelā adani sirunavvu
sīgaḍi sĕrigelā ā kaṁṭi sūbu
veguva jāmuna vāgiḍa vĕlase vannĕla vāsaṁtaṁ
muggula naḍumana siggulu jalle nā sĕli maṁdāraṁ
ĕṁta seruvai vuṁṭe aṁta saṁbaraṁ
premā ĕṁduganī nenaṁṭe aṁta prema nīgu
kammani kalalannī nijamayye kānugichchināvū...
saraṇaṁ 2:
eḍilo taragalle āganaṁṭuṁdi
ĕdurugā nenuṁṭe mūgabodoṁdi
kaṁṭigi kunugaṁṭū rānu pŏmmaṁdi
manasudo ā sūbe āḍuguṁṭoṁdi
e māsaṁlo vastuṁdo jada kalibe śhubhasamayaṁ
aṁdāgā mari āgālaṁṭe viṁṭuṁdā hṛdayaṁ
vesivunna pradi nimuṣhaṁ viṁta anubhavaṁ
premā ĕṁduganī nenaṁṭe aṁta prema nīgu
kammani kalalannī nijamayye kānugichchināvu
innāḽḽagu dŏrigiṁdi o sĕli snehaṁ
ibuḍe adi kānuṁdi tīyani baṁdhaṁ
śhubhalekhalu paṁpe maṁchi muhūrdaṁ paruguna vastoṁdi
premā ĕṁduganī nenaṁṭe aṁta prema nīgu
kammani kalalannī nijamayye kānugichchināvū...