పల్లవి:
ప్రేమ ఓ ప్రేమా నువ్వే నా ప్రేమా
ప్రేమ ఓ ప్రేమా ఇదేనా ప్రేమా
మనసారా తెలిపా నీకు నాలో ప్రేమ
ఒకసారి కనిపిస్తావా నీలో ప్రేమ
గుండెల్లో నిండుగా వుంది నీపై ప్రేమ
చెప్పాలని వున్నా గొంతే దాటని ప్రేమ
నిన్ను నన్ను కలిపే ప్రేమ
నాలో నేనే నలిగే ప్రేమా
ప్రేమ ఓ ప్రేమా నువ్వే నా ప్రేమా
చరణం 1:
నాలో కలలే తెలిసినా దూరం చేయుట న్యాయమా
ఇదివరకెపుడు లేదుగా నాలో ఇంతటి వేదనా
మనసు మాటను ఆలకించినా
కొంచమైనా ఆదరించవా
నీకు తెలియని గాధ నాదిలే
చెప్పగలిగే బాధ కాదులే
ఎదురు చూపులు చూడగా
ఇవ్వరా వరముగ నీ ప్రేమ
ప్రేమ ఓ ప్రేమా నువ్వే నా ప్రేమా
ప్రేమ ఓ ప్రేమా ఇదేనా ప్రేమా
చరణం 2:
నీకు నాకు నడుమన ప్రేమకు ఊపిరి పోయానా
ప్రేమకు కూడా తెలియనీ ప్రేమను నాలో దాయనా
నర నరాలలో ప్రేమ ఉందిలే
నీవు నాలో ప్రాణమేనని
పంచ ప్రాణం నాకు నీవులే
పంచలేని ప్రేమ నాదిలే
కలత నిండిన వేళలో
ఇవ్వరా ప్రేమే మానుపురా
ప్రేమ ఓ ప్రేమా నువ్వే నా ప్రేమా
ప్రేమ ఓ ప్రేమా ఇదేనా ప్రేమా
మనసారా తెలిపా నీకు నాలో ప్రేమ
ఒకసారి కనిపిస్తావా నీలో ప్రేమ
గుండెల్లో నిండుగా వుంది నీపై ప్రేమ
చెప్పాలని వున్నా గొంతే దాటని ప్రేమ
నిన్ను నన్ను కలిపే ప్రేమ
నాలో నేనే నలిగే ప్రేమా
ప్రేమ ఓ ప్రేమా నువ్వే నా ప్రేమా