ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతిక&
పల్లవి:
ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
పమప మమప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్టికి
చరణం 1:
పూల ఎదలలోపులకలు పొడిపించే
భ్రమరరవం ఓం కారమా
సుప్రభాత వేదికపై శుకపికాది
కలరవం ఐంకారమా ||2||
పైరు పాపలకు జోలలు పాడే
గాలుల సవ్వడి హ్రీంకారమా హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల
నడల అలజడి శ్రీంకారమా శ్రీంకారమా
ఆ బీజాక్షర విగతికి అర్పించే జ్యోతలివే
చరణం 2:
పంచభూతముల పరీష్వంగమున ప్రకృతి
పొందిన పదస్పందన అది కవనమా?
మ గ మ పా ప మ పా పా ప ప ప
నిపపప నిపపప నిపాపపమ
గ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ
సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన
సవర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన
సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే
pallavi:
praṇadi praṇadi praṇadi
pa ma pa ma ga ma sa ri sā
praṇadi praṇadi praṇadi
praṇava nāda jagadigi
pamaba mamaba ma pa nī
praṇudi praṇudi praṇudi
pradhama kaḽā sṛṣhṭigi
saraṇaṁ 1:
pūla ĕdalalobulagalu pŏḍibiṁche
bhramararavaṁ oṁ kāramā
suprabhāda vedigabai śhugabigādi
kalaravaṁ aiṁkāramā ||2||
pairu pābalagu jolalu pāḍe
gālula savvaḍi hrīṁkāramā hrīṁkāramā
girula śhirasulanu jāre jharula
naḍala alajaḍi śhrīṁkāramā śhrīṁkāramā
ā bījākṣhara vigadigi arbiṁche jyodalive
saraṇaṁ 2:
paṁchabhūdamula parīṣhvaṁgamuna prakṛti
pŏṁdina padaspaṁdana adi kavanamā?
ma ga ma pā pa ma pā pā pa pa pa
nibabapa nibabapa nibābabama
ga pa ma pa ma gā
aṁtaraṁgamuna alalĕttina sarvāṁga
saṁchalana keḽanā adi naḍanamā adi naḍanamā
kaṁṭi tudala hariviṁṭi pŏdala taḽugaṁdina
savarṇa lekhanā adi sitramā adi sitramā
mauna śhilala saidanya mūrduluga malasina
sajīva kalbanā adi śhilbamā adi śhilbamā
ā lalida kaḽā sṛṣhṭigi arbiṁche jyodalive