Poyyevo povo amtebo baalumdaa

పొయ్యేవో పోవో అంతేపో బాలుఁడా
Language

(॥పల్లవి॥)
పొయ్యేవో పోవో అంతేపో బాలుఁడా
వొయ్యన చేరేవు నే మోపమయ్య బాలుఁడా

(॥పొయ్యే॥)
చంక నెత్తుకోఁబోఁగా సంది జీరువారుఁ జేసు
అంకెలబాలుఁడ మమ్ము నంటకువయ్యా
పొంకమున నీయెదుటఁ బొలయరాదా చెలులు
కొంకక నాపైఁ బడేవు కొయ్యవుగా బాలుఁడా

(॥పొయ్యే॥)
ముద్దువెట్టుకోఁబోఁగా మోవి పల్లు నాటుఁ జేసు
వొద్దువొద్దు బాలుఁడా నే మొల్లమయ్య
అద్దో యశోదతోడ ముచ్చటాడరాదా మాకు
వుద్దండానఁ బైపడేవు వుండరాదా బాలుఁడా

(॥పొయ్యే॥)
అప్ప లప్పలనఁబోఁగా నాయము కరఁగుఁ జేసు
తప్పక మాకుచములు దాఁకీనయ్యా
చెప్పఁగానే వుద్దండానఁ జెఱఁగు వట్టితి విదె
వొప్పితి శ్రీవేంకటాద్రి వొరపరి బాలుఁడా

(||pallavi||)
pŏyyevo povo aṁtebo bālum̐ḍā
vŏyyana serevu ne mobamayya bālum̐ḍā

(||pŏyye||)
saṁka nĕttugom̐bom̐gā saṁdi jīruvārum̐ jesu
aṁkĕlabālum̐ḍa mammu naṁṭaguvayyā
pŏṁkamuna nīyĕduḍam̐ bŏlayarādā sĕlulu
kŏṁkaga nābaim̐ baḍevu kŏyyavugā bālum̐ḍā

(||pŏyye||)
mudduvĕṭṭugom̐bom̐gā movi pallu nāḍum̐ jesu
vŏdduvŏddu bālum̐ḍā ne mŏllamayya
addo yaśhodadoḍa muchchaḍāḍarādā māgu
vuddaṁḍānam̐ baibaḍevu vuṁḍarādā bālum̐ḍā

(||pŏyye||)
appa lappalanam̐bom̐gā nāyamu karam̐gum̐ jesu
tappaga māgusamulu dām̐kīnayyā
sĕppam̐gāne vuddaṁḍānam̐ jĕṟam̐gu vaṭṭidi vidĕ
vŏppidi śhrīveṁkaḍādri vŏrabari bālum̐ḍā