పొత్తులవలపు గద్దా బూమిలోనను
(॥పల్లవి॥)
పొత్తులవలపు గద్దా బూమిలోనను
యిత్తల నీచేఁతలకు నేమందు నిన్నును
(॥పొత్తు॥)
బత్తితోడ నాపె నీకు పాదాలొత్తఁగాను
హత్తి నామొగము చూచే వదేమి నీవు
కొత్తలుగా నాపెనిన్నుఁ గొచ్చికొచ్చి చూడఁగాను
చిత్తగించి నాపైనేల చేయిచాఁచేవు
(॥పొత్తు॥)
మచ్చికతో నాపె నీతో మాటలెల్లా నాడఁగాను
అచ్చలాన నాతో నవ్వే వదేమి నీవు
పచ్చిదేర నాపె నీకు బాగా లందియ్యగాను
ఇచ్చకానకు నాకిచ్చే వింతలోనే నీవు
(॥పొత్తు॥)
నెట్టుకొని సేస లాపె నీపైఁ జల్లఁగా నాకు
అట్టె పచ్చడము గప్పే వదేమి నీవు
యిట్టె శ్రీవేంకటేశుఁడ యిద్దరి నేలితి విదె
గట్టిగా మేలవాఁడవై కలిగితివి నాకు
(||pallavi||)
pŏttulavalabu gaddā būmilonanu
yittala nīsem̐talagu nemaṁdu ninnunu
(||pŏttu||)
battidoḍa nābĕ nīgu pādālŏttam̐gānu
hatti nāmŏgamu sūse vademi nīvu
kŏttalugā nābĕninnum̐ gŏchchigŏchchi sūḍam̐gānu
sittagiṁchi nābainela seyisām̐sevu
(||pŏttu||)
machchigado nābĕ nīdo māḍalĕllā nāḍam̐gānu
achchalāna nādo navve vademi nīvu
pachchidera nābĕ nīgu bāgā laṁdiyyagānu
ichchagānagu nāgichche viṁtalone nīvu
(||pŏttu||)
nĕṭṭugŏni sesa lābĕ nībaim̐ jallam̐gā nāgu
aṭṭĕ pachchaḍamu gappe vademi nīvu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍa yiddari nelidi vidĕ
gaṭṭigā melavām̐ḍavai kaligidivi nāgu