పొరుగు పోరచి వలపులు నీవెంత చల్లేవు
(॥పల్లవి॥)
పొరుగు పోరచి వలపులు నీవెంత చల్లేవు
గరితెవు పెండ్లాడితేఁ గాదనెనా
(॥పోరు॥)
మొక్కినదాన వాతనిముందరఁ గూచుండరాదా
యిక్కడనక్కడనుండి యేమి లాచేవే
నిక్కిచూచినదానవు నిండా మాటాడఁగరాదా
చెక్కిటిచేతితోనేల సిగ్గులుచూపేవే
(॥పోరు॥)
సన్నచేసినదానవు చన్నుల నొత్తఁగరాదా
యిన్నిటా మూసిమఱఁగు లిఁకనేఁటికే
కిన్నేరమీటేదానవు కేలట్టెపైఁ జాఁచరాదా
వున్నతపుటాసలేల వుమురఁబెట్టేవే
(॥పోరు॥)
కొలువుసేసేదానవు కుచ్చి కాఁగిలించరాదా
సెలవులనవ్వులేల చిందుకొనేవు
అలరి శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవిభుఁడు
మలసి నన్నేలె నీవు మన్నింపించుకోఁగదే
(||pallavi||)
pŏrugu porasi valabulu nīvĕṁta sallevu
garidĕvu pĕṁḍlāḍidem̐ gādanĕnā
(||poru||)
mŏkkinadāna vādanimuṁdaram̐ gūsuṁḍarādā
yikkaḍanakkaḍanuṁḍi yemi lāseve
nikkisūsinadānavu niṁḍā māḍāḍam̐garādā
sĕkkiḍisedidonela siggulusūbeve
(||poru||)
sannasesinadānavu sannula nŏttam̐garādā
yinniḍā mūsimaṟam̐gu lim̐kanem̐ṭige
kinneramīḍedānavu kelaṭṭĕbaim̐ jām̐sarādā
vunnadabuḍāsalela vumuram̐bĕṭṭeve
(||poru||)
kŏluvusesedānavu kuchchi kām̐giliṁcharādā
sĕlavulanavvulela siṁdugŏnevu
alari śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavibhum̐ḍu
malasi nannelĕ nīvu manniṁpiṁchugom̐gade