Pomduseya nersina yee purushumde valemgaani

పొందుసేయ నేర్చిన యీ పురుషుఁడే వలెఁగాని
Language

(॥పల్లవి॥)
పొందుసేయ నేర్చిన యీ పురుషుఁడే వలెఁగాని
ఇందుముఖుల భాగ్య మెంత చేసుకోరాదే

(॥పొందు॥)
చెలిమిసేయ నేర్చితే చిత్తమే కామధేనువు
పలుక నేర్చితే నోరే పారిజాతము
సొలయనేరిచితేను చూపులే చింతామణులు
యెలమి గాంతలభాగ్య మేమి సేసుకోరాదే

(॥పొందు॥)
సంతోసించ నేరిచితే సరసమే నిధానము
వంతునఁ గూడనేర్చితే వాడికే పెండ్లి
చెంత నవ్వనేర్చితే సిగ్గులే రత్నాలరాశి
యింతటాఁ జెలులభాగ్య మెంతసేసుకోరాదే

(॥పొందు॥)
పైకొన నేరిచితేను పాయమే బంగారుకొండ
యీకడ మెచ్చనేర్చితే యీపు సంజీవి
జోకతోడ శ్రీవేంకటేశుఁడు యిందరినిఁ గూడె
యేకాల మింతుల భాగ్య మెంత సేసుకోరాదే

(||pallavi||)
pŏṁduseya nersina yī puruṣhum̐ḍe valĕm̐gāni
iṁdumukhula bhāgya mĕṁta sesugorāde

(||pŏṁdu||)
sĕlimiseya nerside sittame kāmadhenuvu
paluga nerside nore pārijādamu
sŏlayanerisidenu sūbule siṁtāmaṇulu
yĕlami gāṁtalabhāgya memi sesugorāde

(||pŏṁdu||)
saṁtosiṁcha neriside sarasame nidhānamu
vaṁtunam̐ gūḍanerside vāḍige pĕṁḍli
sĕṁta navvanerside siggule ratnālarāśhi
yiṁtaḍām̐ jĕlulabhāgya mĕṁtasesugorāde

(||pŏṁdu||)
paigŏna nerisidenu pāyame baṁgārugŏṁḍa
yīgaḍa mĕchchanerside yību saṁjīvi
jogadoḍa śhrīveṁkaḍeśhum̐ḍu yiṁdarinim̐ gūḍĕ
yegāla miṁtula bhāgya mĕṁta sesugorāde