Pomdusesi radulu pamdi pollavovanittu radave

పొందుసేసి రతులు పండి పొల్లవోవనిత్తు రటవే
Language

(॥పల్లవి॥)
పొందుసేసి రతులు పండి పొల్లవోవనిత్తు రటవే
సందడించెఁ దమక మతనిఁ జక్కఁజూడవే

(॥పొందు॥)
కోటికొండలైన మనసుకోరికలకు గొలఁది లేదు
వాఁటమైన జవ్వనంపు వయసువారికి
వూటలగుచు మోహరసము లూరనూర నేరులవును
యేఁటి కింతసిగ్గు పతితో మాఁటలాడవే

(॥పొందు॥)
అనలుఁ గొనలు సాగినట్టి యాసలు గడించ రావు
తనివిలేని చుట్టరికపు తగులువారికి
తనువు మీఁది చక్కఁదనము దట్టమగుచు మోపులవును
ననిచె నీకు సిగ్గువడక నవ్వు నవ్వవే

(॥పొందు॥)
యెదురు దొట్టి వేడ్కలెల్ల యీఁతలాయ దాఁటరావు
వదరాని కాఁగిళ్ల వలపువారికి
యిదివో శ్రీ వేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
ముదురుసిగ్గు లింకనేల మోవి చవులు చూపవే

(||pallavi||)
pŏṁdusesi radulu paṁḍi pŏllavovanittu raḍave
saṁdaḍiṁchĕm̐ damaga madanim̐ jakkam̐jūḍave

(||pŏṁdu||)
koḍigŏṁḍalaina manasugorigalagu gŏlam̐di ledu
vām̐ṭamaina javvanaṁpu vayasuvārigi
vūḍalagusu moharasamu lūranūra nerulavunu
yem̐ṭi kiṁtasiggu padido mām̐ṭalāḍave

(||pŏṁdu||)
analum̐ gŏnalu sāginaṭṭi yāsalu gaḍiṁcha rāvu
tanivileni suṭṭarigabu taguluvārigi
tanuvu mīm̐di sakkam̐danamu daṭṭamagusu mobulavunu
nanisĕ nīgu sigguvaḍaga navvu navvave

(||pŏṁdu||)
yĕduru dŏṭṭi veḍkalĕlla yīm̐talāya dām̐ṭarāvu
vadarāni kām̐giḽla valabuvārigi
yidivo śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
mudurusiggu liṁkanela movi savulu sūbave