పొందు గలిగితే నన్నీఁ బొసఁగుఁగాక
(॥పల్లవి॥)
పొందు గలిగితే నన్నీఁ బొసఁగుఁగాక
చందము గానియప్పుడు సమ్మతులు గూడునా
(॥॥)
మనసురాని చోటికి మంతనము లేమిటికి
చనవులేనియడకు సరసాలేల
ననుపులేనిపట్ల నగవులు చవిగావు
అనుమానమైనచొట ఆసపడఁదగునా
(॥॥)
యితవుగానివేళ ఇచ్చకము లేలవచ్చు
సతముగానివారిసంగా లొద్దు
రతి కెక్కనివలపు రాయిడికి మూలము
తతిగానివయసుకు తమక మమరునా
(॥॥)
సిగ్గులు ముంచుకొనఁగా సేసలెట్టు వెట్టుఁజెల్లు
యెగ్గుపట్టఁ బూనితేను యెనయరాదు
అగ్గమై శ్రీ వేంకటేశ అట్టె నన్ను నేలితివి
వెగ్గలించె సంతోసాలు వేగిరించఁదగునా
(||pallavi||)
pŏṁdu galigide nannīm̐ bŏsam̐gum̐gāga
saṁdamu gāniyappuḍu sammadulu gūḍunā
(||||)
manasurāni soḍigi maṁtanamu lemiḍigi
sanavuleniyaḍagu sarasālela
nanubulenibaṭla nagavulu savigāvu
anumānamainasŏḍa āsabaḍam̐dagunā
(||||)
yidavugāniveḽa ichchagamu lelavachchu
sadamugānivārisaṁgā lŏddu
radi kĕkkanivalabu rāyiḍigi mūlamu
tadigānivayasugu tamaga mamarunā
(||||)
siggulu muṁchugŏnam̐gā sesalĕṭṭu vĕṭṭum̐jĕllu
yĕggubaṭṭam̐ būnidenu yĕnayarādu
aggamai śhrī veṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
vĕggaliṁchĕ saṁtosālu vegiriṁcham̐dagunā