Pomdinavaaramu nemu buddulu seppaga podu

పొందినవారము నేము బుద్దులు చెప్పక పోదు
Language

(॥పల్లవి॥)
పొందినవారము నేము బుద్దులు చెప్పక పోదు
పందెములు వేసి మీరు పంతాలు మెరయరే

(॥పొంది॥)
అగడుగా జగడించే రాతనికి నీకును
తగవు చెప్పే రావే తరుణి
మగవాఁడు పట్టఁజెల్లు మగువ దిట్టఁగఁ జెల్లు
వెగటున మీలో మీరు వెనకతియ్యకురే

(॥పొంది॥)
వుమ్మడినే పెనఁగేరు వుద్దండాలు మెరయుచు
సమ్మతించఁ జెప్పే రావే సకియ
దిమ్మరితన మాతనిది దిట్టతనము నీది
నెమ్మది నింకా మీరు నేర్పులు మెరయురే

(॥పొంది॥)
తత్తరించి అలిగేరు తమకించి కూడేరు
పొత్తునఁ గంపే రావే పొలఁతి
ఇత్తల శ్రీవేంకటేశుఁ డీతఁడు నన్నేలె మేలు
హత్తి యిద్దరు నిద్దరే అంకెల సాదించరే

(||pallavi||)
pŏṁdinavāramu nemu buddulu sĕppaga podu
paṁdĕmulu vesi mīru paṁtālu mĕrayare

(||pŏṁdi||)
agaḍugā jagaḍiṁche rādanigi nīgunu
tagavu sĕppe rāve taruṇi
magavām̐ḍu paṭṭam̐jĕllu maguva diṭṭam̐gam̐ jĕllu
vĕgaḍuna mīlo mīru vĕnagadiyyagure

(||pŏṁdi||)
vummaḍine pĕnam̐geru vuddaṁḍālu mĕrayusu
sammadiṁcham̐ jĕppe rāve sagiya
dimmaridana mādanidi diṭṭadanamu nīdi
nĕmmadi niṁkā mīru nerbulu mĕrayure

(||pŏṁdi||)
tattariṁchi aligeru tamagiṁchi kūḍeru
pŏttunam̐ gaṁpe rāve pŏlam̐ti
ittala śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍu nannelĕ melu
hatti yiddaru niddare aṁkĕla sādiṁchare