పోలిచితే నీ బాగులు పొద్దొక వింతలాయ
(॥పల్లవి॥)
పోలిచితే నీ బాగులు పొద్దొక వింతలాయ
మేలు మేలు నిన్నుఁ జూచి మెచ్చేరే నీ చెలులు
(॥పోలి॥)
ముచ్చటలాడీఁ దుమ్మిదమూఁకలు నీనొసలిపై
రచ్చకెక్చీ జక్కవలు రాసీ నక్కున
పచ్చితేరీఁ జిగురాకు పలుకులవాతెరను
గచ్చులనీసింగారాలు కతలాయఁగదవే
(॥పోలి॥)
వెన్నెలలుగాసీని వేడుకనీసెలవుల
కన్నులఁ జకోరా లేకతమాడీని
మిన్నక జాజితీగె మేకొనుచు ననలొత్తీ
కన్నెరో సింగారాలు కతలాయఁగదవే
(॥పోలి॥)
నెట్టుకొని చలిగాలి నిగిడీ నీముక్కునను
తొట్టీ నీపై వెరగుల తోడు తోడనె
యిట్టె శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁగూడె
గట్టిగ నీసింగారాలు కతలాయఁగదవే
(||pallavi||)
poliside nī bāgulu pŏddŏga viṁtalāya
melu melu ninnum̐ jūsi mĕchchere nī sĕlulu
(||poli||)
muchchaḍalāḍīm̐ dummidamūm̐kalu nīnŏsalibai
rachchagĕkchī jakkavalu rāsī nakkuna
pachchiderīm̐ jigurāgu palugulavādĕranu
gachchulanīsiṁgārālu kadalāyam̐gadave
(||poli||)
vĕnnĕlalugāsīni veḍuganīsĕlavula
kannulam̐ jagorā legadamāḍīni
minnaga jājidīgĕ megŏnusu nanalŏttī
kannĕro siṁgārālu kadalāyam̐gadave
(||poli||)
nĕṭṭugŏni saligāli nigiḍī nīmukkunanu
tŏṭṭī nībai vĕragula toḍu toḍanĕ
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐gūḍĕ
gaṭṭiga nīsiṁgārālu kadalāyam̐gadave