Polimti javvanamunam boovaga poose

పొలిఁతి జవ్వనమునఁ బూవక పూచె
Language

(॥పల్లవి॥)
పొలిఁతి జవ్వనమునఁ బూవక పూచె
యెలమి నిందుకు మనమేమి సేసేదే

(॥పొలి॥)
సతి చింతాలతలలో సంపెంగపూవులు వూచె
మతివిరహపుమేన మల్లెలు వూచె
అతనునితలపోఁత నడవిజాజులు వూచె
హితవు తెలియ దిఁక నేమిసేసేదే

(॥పొలి॥)
తొయ్యలిచెమటనీట దొంతిదామెరలు వూచె
కొయ్యచూపుఁగోపముల గుంకుమ వూచె
కయ్యపువలపులఁ జీఁకటిమాకులు వూచె
నియ్యెడఁ జెలియభావ మేమిసేసేది

(॥పొలి॥)
మగువరతులలోన మంకెనపువ్వులు వూచె
మొగిఁ గొనగోళ్లనే మొగలి వూచె
పొగరు శ్రీవేంకటేశుపొందులఁ గప్రము వూచె
ఇగురుఁబోండ్ల మిక నేమసేసేదే

(||pallavi||)
pŏlim̐ti javvanamunam̐ būvaga pūsĕ
yĕlami niṁdugu manamemi sesede

(||pŏli||)
sadi siṁtāladalalo saṁpĕṁgabūvulu vūsĕ
madivirahabumena mallĕlu vūsĕ
adanunidalabom̐ta naḍavijājulu vūsĕ
hidavu tĕliya dim̐ka nemisesede

(||pŏli||)
tŏyyalisĕmaḍanīḍa dŏṁtidāmĕralu vūsĕ
kŏyyasūbum̐gobamula guṁkuma vūsĕ
kayyabuvalabulam̐ jīm̐kaḍimāgulu vūsĕ
niyyĕḍam̐ jĕliyabhāva memisesedi

(||pŏli||)
maguvaradulalona maṁkĕnabuvvulu vūsĕ
mŏgim̐ gŏnagoḽlane mŏgali vūsĕ
pŏgaru śhrīveṁkaḍeśhubŏṁdulam̐ gapramu vūsĕ
igurum̐boṁḍla miga nemasesede