Polamtule valabula puttugula polamulu

పొలఁతులే వలపుల పుట్టుగుల పొలములు
Language

(॥పల్లవి॥)
పొలఁతులే వలపుల పుట్టుగుల పొలములు
తెలియఁగ నెట్టువచ్చు దేవుఁడే యెఱుఁగును

(॥పొలఁ॥)
సొలపుఁగన్నులు మించుఁజూపులవిత్తనములు
లలి దంతములు నవ్వులమొలకలు
పలుచని పెదవుల పలుకుల చిగురులు
తళుకుఁ జెక్కులు సొంపుఁగళల మారాకులు

(॥పొలఁ॥)
బరయుఁ జేతులు రతిఁ బెనగొనే తీగెలు
కరములు చేఁతల కంగపు విరులు
సరుస జన్నులు మంచి జవ్వనపుఁ గాయలు
సరవిఁ జక్కఁదనాల సంసారపు పంటలు

(॥పొలఁ॥)
కటిసొబగులు రతికాణాచి కణజాలు
కుటిలకుంతలాలే కొమ్మలబాగు
ఇటువలె శ్రీవేంకటేశ్వరుని వేడుకలు
విటవిటీ జనులందు వెల పై నీకతలు

(||pallavi||)
pŏlam̐tule valabula puṭṭugula pŏlamulu
tĕliyam̐ga nĕṭṭuvachchu devum̐ḍe yĕṟum̐gunu

(||pŏlam̐||)
sŏlabum̐gannulu miṁchum̐jūbulavittanamulu
lali daṁtamulu navvulamŏlagalu
palusani pĕdavula palugula sigurulu
taḽugum̐ jĕkkulu sŏṁpum̐gaḽala mārāgulu

(||pŏlam̐||)
barayum̐ jedulu radim̐ bĕnagŏne tīgĕlu
karamulu sem̐tala kaṁgabu virulu
sarusa jannulu maṁchi javvanabum̐ gāyalu
saravim̐ jakkam̐danāla saṁsārabu paṁṭalu

(||pŏlam̐||)
kaḍisŏbagulu radigāṇāsi kaṇajālu
kuḍilaguṁtalāle kŏmmalabāgu
iḍuvalĕ śhrīveṁkaḍeśhvaruni veḍugalu
viḍaviḍī janulaṁdu vĕla pai nīgadalu