Pogada vasamugaadu vooni yeedani gunaalu

పొగడ వసముగాదు వూని యీతని గుణాలు
Language

(॥పల్లవి॥)
పొగడ వసముగాదు వూని యీతని గుణాలు
మొగము చూచి చూచి మొక్కేనే నేను

(॥పొగ॥)
వేడుకకత్తెలతోడివెడవెడనవ్వులు
వూడిగాలవారితోడివొడఁబాటులు
వాడవనితలతోడివరుసజాణతనాలు
యేడ నేర్చుకొన్నాఁడే యీతఁడు తాను

(॥పొగ॥)
కొలువుకాంతలమీఁదిగుదిగొన్నచూపులు
వెలయాండ్లతో నాడేవినోదములు
వలచివచ్చినయట్టివారిపొందులు
చలపట్టి యెన్నఁడు సాదించెనే తాను

(॥పొగ॥)
చేరి వున్నవారితోడఁ జేసేటిసన్నలు
కోరి యలమేలుమంగకూటములు
యీరీతి శ్రీవేంకటేశుఁ డేలిననాతో మెచ్చులు
కూరిమి నెట్టు గడించుకొనెనే తాను

(||pallavi||)
pŏgaḍa vasamugādu vūni yīdani guṇālu
mŏgamu sūsi sūsi mŏkkene nenu

(||pŏga||)
veḍugagattĕladoḍivĕḍavĕḍanavvulu
vūḍigālavāridoḍivŏḍam̐bāḍulu
vāḍavanidaladoḍivarusajāṇadanālu
yeḍa nersugŏnnām̐ḍe yīdam̐ḍu tānu

(||pŏga||)
kŏluvugāṁtalamīm̐digudigŏnnasūbulu
vĕlayāṁḍlado nāḍevinodamulu
valasivachchinayaṭṭivāribŏṁdulu
salabaṭṭi yĕnnam̐ḍu sādiṁchĕne tānu

(||pŏga||)
seri vunnavāridoḍam̐ jeseḍisannalu
kori yalamelumaṁgagūḍamulu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍelinanādo mĕchchulu
kūrimi nĕṭṭu gaḍiṁchugŏnĕne tānu