Podduvonivaamdu taanu pomchi nannum jenageeni

పొద్దువోనివాఁడు తాను పొంచి నన్నుఁ జెనకీని
Language

(॥పల్లవి॥)
పొద్దువోనివాఁడు తాను పొంచి నన్నుఁ జెనకీని
వొద్దికైతి నే నంతేసి కోపుదునటే

(॥పొద్దు॥)
పెనఁగులాడి తేను పెంజెమట లుప్పతిలు
ననిచి సిగ్గువడితే నవ్వులు రేఁగు
కనుఁగవఁ జూడఁజూడ కాంక్షలు మిక్కుటమౌను
వొసరి తనతో పొందు కోపుదునటే

(॥పొద్దు॥)
కడుఁగడుమాటాడితే గ్రక్కన మర్మాలు సోఁకు
తడవితేఁ దమకము దైలువారు
వొడిఁగట్టుకొంటేను వుమ్మగిలు వలపులు
వుడివోనివేడుకల కోపుదునటే

(॥పొద్దు॥)
చెలఁగి కాఁగిలించితే చిత్తమెల్లాఁ గరఁగును
కొలువు సేసితే నాస గుబ్బతిలును
యెలమి శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నింతలోనె
వులివచ్చిచేఁతలకు నోపుదునటే

(||pallavi||)
pŏdduvonivām̐ḍu tānu pŏṁchi nannum̐ jĕnagīni
vŏddigaidi ne naṁtesi kobudunaḍe

(||pŏddu||)
pĕnam̐gulāḍi tenu pĕṁjĕmaḍa luppadilu
nanisi sigguvaḍide navvulu rem̐gu
kanum̐gavam̐ jūḍam̐jūḍa kāṁkṣhalu mikkuḍamaunu
vŏsari tanado pŏṁdu kobudunaḍe

(||pŏddu||)
kaḍum̐gaḍumāḍāḍide grakkana marmālu som̐ku
taḍavidem̐ damagamu dailuvāru
vŏḍim̐gaṭṭugŏṁṭenu vummagilu valabulu
vuḍivoniveḍugala kobudunaḍe

(||pŏddu||)
sĕlam̐gi kām̐giliṁchide sittamĕllām̐ garam̐gunu
kŏluvu seside nāsa gubbadilunu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu niṁtalonĕ
vulivachchisem̐talagu nobudunaḍe