Podduvoga ne noorage podigemgaaga

పొద్దువోక నే నూరకే పొదిగేఁగాక
Language

(॥పల్లవి॥)
పొద్దువోక నే నూరకే పొదిగేఁగాక
తిద్దరాని గుణములు తీరువడీనా

(॥పొద్దు॥)
పొరలింపు మాట లాడి పొద్దుగడపేవాని
కరకరిఁబెట్టఁగాను కలిగేదేమీ
గొరబైన వలపులు కుప్పచేసి రమణుని
దరవులు వెట్టఁగాను తనివయ్యీనా

(॥పొద్దు॥)
చుట్టరికములే చూపి చొక్కులఁబెట్టేవాని
నెట్టుకొని సొలయఁగా నిలిచేదేమి
బట్టబయలు నవ్వులు పచరించి రమణుని
జట్టిగొని పెనఁగఁగా సవులయ్యీనా

(॥పొద్దు॥)
ఆయము లూరకే యంటి ఆసలఁబెట్టేవాని
చేయిచాఁచి చెనకఁగా చేరేదేమి
యియ్యెడ శ్రీ వేంకటేశుఁ డీతఁడే నన్నుఁగూడె
వేయైనాఁ దనకు నిఁక వేసటయ్యీనా

(||pallavi||)
pŏdduvoga ne nūrage pŏdigem̐gāga
tiddarāni guṇamulu tīruvaḍīnā

(||pŏddu||)
pŏraliṁpu māḍa lāḍi pŏddugaḍabevāni
karagarim̐bĕṭṭam̐gānu kaligedemī
gŏrabaina valabulu kuppasesi ramaṇuni
daravulu vĕṭṭam̐gānu tanivayyīnā

(||pŏddu||)
suṭṭarigamule sūbi sŏkkulam̐bĕṭṭevāni
nĕṭṭugŏni sŏlayam̐gā nilisedemi
baṭṭabayalu navvulu pasariṁchi ramaṇuni
jaṭṭigŏni pĕnam̐gam̐gā savulayyīnā

(||pŏddu||)
āyamu lūrage yaṁṭi āsalam̐bĕṭṭevāni
seyisām̐si sĕnagam̐gā seredemi
yiyyĕḍa śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannum̐gūḍĕ
veyainām̐ danagu nim̐ka vesaḍayyīnā