(॥పల్లవి॥)
పొద్దువోక కిటు పొలసితిని
అద్దము నీడల నాఁగేవా
(॥పొద్దు॥)
పెనఁగఁగ నేఁటికి పిలువఁగ నేఁటికి
ననుపున నూరక నవ్వితిని
చనవరికాంతవె చాలు నీకు నిఁక
కనుకలి వినుకలి గాణాచా
(॥పొద్దు॥)
పట్టఁగ నేఁటికి పయికొననేఁటికి
చుట్టపు వరుసలఁ జూచితిని
పెట్టువలపులె ప్రియములు నీ కిఁక
జట్టిబేరములు సతమవునా
(॥పొద్దు॥)
బాసలిఁ కేఁటికి బచ్చన లేఁటికి
వాసివంతులకె వచ్చితిని
ఆసల శ్రీవేంకటాధిప కూడితి
వేసతులును నా కిటయ్యేరా
(||pallavi||)
pŏdduvoga kiḍu pŏlasidini
addamu nīḍala nām̐gevā
(||pŏddu||)
pĕnam̐gam̐ga nem̐ṭigi piluvam̐ga nem̐ṭigi
nanubuna nūraga navvidini
sanavarigāṁtavĕ sālu nīgu nim̐ka
kanugali vinugali gāṇāsā
(||pŏddu||)
paṭṭam̐ga nem̐ṭigi payigŏnanem̐ṭigi
suṭṭabu varusalam̐ jūsidini
pĕṭṭuvalabulĕ priyamulu nī kim̐ka
jaṭṭiberamulu sadamavunā
(||pŏddu||)
bāsalim̐ kem̐ṭigi bachchana lem̐ṭigi
vāsivaṁtulagĕ vachchidini
āsala śhrīveṁkaḍādhiba kūḍidi
vesadulunu nā kiḍayyerā