Poddunne puttimdi samdamaama

పొద్దున్నే పుట్టింది చందమామ
Work
Year
Language

పల్లవి:

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగ పుట్టావ గీతికా హోయ్
స్నేహంతో మీటావ మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దరలేచీ ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

చరణం 1:

ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మా ఓ రబ్బరు బొమ్మా లాలించేదెట్టా చెప్పమ్మా
మొగ్గంటి బుగ్గలో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జో కొట్టాలయ్యో
నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికీ
ముందూ ముడుపూలేనీ ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో
ఇక ఏ పేరు పేట్టాలో ఇన్నాళ్ళు ఎరుగని ఈ కొంటె చక్కిలిగింతల ఉకిరిబిక్కిరికి

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

చరణం 2:

నీ కోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లే గూడే కట్టాను నా బంగరు గువ్వ గుమ్మంలో చూపులు పెట్టాను
నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను నా పచ్చని కొమ్మా పొమ్మన్నా పక్కకి పోలేను
శృంగార స్నేహాల సంకెళ్ళు వెయ్యాల చింగారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకూదుడుకూ తగ్గించీ కొంగునకట్టేసేది కిటుకేదో చెప్పమ్మా
పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదో రేయేదో తేలియదు లేవయ్యో

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగ పుట్టావ గీతికా హోయ్
స్నేహంతో మీటావ మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దరలేచీ ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

pallavi:

pŏddunne puṭṭiṁdi saṁdamāma
mŏggalle vichchiṁdi muddugumma
maunaṁga puṭṭāva gīdigā hoy
snehaṁto mīḍāva mĕllagā
tŏli pŏddaṁṭi aṁdālu ī nāḍu niddaralesī mutyāla muggulubĕṭṭe vannĕla vāgiṭlo

pŏddunne puṭṭiṁdi saṁdamāma
mŏggalle vichchiṁdi muddugumma

saraṇaṁ 1:

uggĕṭṭā paṭṭālo nalugĕṭṭā pĕṭṭālo lālĕṭṭā poyāloyammā o rabbaru bŏmmā lāliṁchedĕṭṭā sĕppammā
mŏggaṁṭi buggalo aggalle siggŏste jābillini rappiṁchālayyo o muddula kannā kaugiṭlo jo kŏṭṭālayyo
nā kaṁṭi pāballo uyyāla vĕyyālā ī kŏṁṭĕ pābāyigī
muṁdū muḍubūlenī ī pŏdduḍi vĕnnĕla āvirilo muddu muribālanni paṁḍiṁchedĕṭṭāgo
iga e peru peṭṭālo innāḽḽu ĕrugani ī kŏṁṭĕ sakkiligiṁtala ugiribikkirigi

pŏddunne puṭṭiṁdi saṁdamāma
mŏggalle vichchiṁdi muddugumma

saraṇaṁ 2:

nī kosaṁ puṭṭānu niluvĕllā pūsānu guṁḍĕlle gūḍe kaṭṭānu nā baṁgaru guvva gummaṁlo sūbulu pĕṭṭānu
nī nestaṁ kaṭṭānu nī dāre paṭṭānu kaḽḽallo kāburamuṁṭānu nā pachchani kŏmmā pŏmmannā pakkagi polenu
śhṛṁgāra snehāla saṁkĕḽḽu vĕyyāla siṁgāri siṁdāḍado
urige godāraṁṭi nā uḍugūduḍugū taggiṁchī kŏṁgunagaṭṭesedi kiḍugedo sĕppammā
pasi paruvālu sūstuṁṭe baruvaina kannullo pagaledo reyedo teliyadu levayyo

pŏddunne puṭṭiṁdi saṁdamāma
mŏggalle vichchiṁdi muddugumma
maunaṁga puṭṭāva gīdigā hoy
snehaṁto mīḍāva mĕllagā
tŏli pŏddaṁṭi aṁdālu ī nāḍu niddaralesī mutyāla muggulubĕṭṭe vannĕla vāgiṭlo