పొద్దొక విధమై యుండు పొందు లెంచి చూచితేను
(॥పల్లవి॥)
పొద్దొక విధమై యుండు పొందు లెంచి చూచితేను
బుద్ది చెప్పేమాట విని వొద్దికి రమ్మనవే
(॥పొద్దొ॥)
వినుకలి యాసలు వింతచవులై తోఁచు
కనుకలిఁ దమకము గనమై తోఁచు
మనసులో తలపోఁత మరితరితీపై తోఁచు
యెనసిన మీఁద నన్నీ నింపులై తోఁచును
(॥పొద్దొ॥)
సరసపుఁ జెనకులు సమరతులై తోఁచు
పరగిన సన్నలు లాభములై తోఁచు
సొరిది మొగమోటలు చుట్టరికాలై తోఁచు
తరవాత నివియే తగుళ్లై తోఁచును
(॥పొద్దొ॥)
నెట్టుకొన్న కాఁగిళ్లు నిధానములై తోఁచు
గుట్టుతోడినవ్వులే గురులై తోఁచు
యిట్టె శ్రీ వేంకటేశుఁ డిన్నిటానునన్ను నేలె
చుట్టుకొంటే సంతోసాలు సులభమై తోఁచును
(||pallavi||)
pŏddŏga vidhamai yuṁḍu pŏṁdu lĕṁchi sūsidenu
buddi sĕppemāḍa vini vŏddigi rammanave
(||pŏddŏ||)
vinugali yāsalu viṁtasavulai tom̐su
kanugalim̐ damagamu ganamai tom̐su
manasulo talabom̐ta maridaridībai tom̐su
yĕnasina mīm̐da nannī niṁpulai tom̐sunu
(||pŏddŏ||)
sarasabum̐ jĕnagulu samaradulai tom̐su
paragina sannalu lābhamulai tom̐su
sŏridi mŏgamoḍalu suṭṭarigālai tom̐su
taravāda niviye taguḽlai tom̐sunu
(||pŏddŏ||)
nĕṭṭugŏnna kām̐giḽlu nidhānamulai tom̐su
guṭṭudoḍinavvule gurulai tom̐su
yiṭṭĕ śhrī veṁkaḍeśhum̐ ḍinniḍānunannu nelĕ
suṭṭugŏṁṭe saṁtosālu sulabhamai tom̐sunu