పొదలె నిండుఁగళల పున్నమ నేఁడు
(॥పల్లవి॥)
పొదలె నిండుఁగళల పున్నమ నేఁడు
అదను దప్పక జాజరాడుదువు రావయ్యా
(॥పొద॥)
జలజాక్షి మోమునను చంద్రోదయమాయ
నెలకొన్న నవ్వుల వెన్నెల గాసెను
కలికి కన్నుల నల్లఁగలువలు వికసించె
అలరి యీకెతో జాజ రాడుదువు రావయ్యా
(॥పొద॥)
యెనసి జవ్వనమున నేతెంచె వసంతకాల
మొనరి మోవిఁ జిగురు లుప్పతిలెను
గొనకొన్న తురుమునఁ గూడె తుమ్మిదమూఁక
అనుమానించక జాజ రాడుదువు రావయ్యా
(॥పొద॥)
కుంకుమ చెమట చనుఁ గొప్పెరల నిండుకొనె
కొంకక గోళ్లే బుఱ్ఱటకొమ్ము లాయెను
లంకెలై శ్రీవేంకటేశ లలనతోఁ గూడితివి
అంకెల నేపొద్దూ జాజ రాడుదువు రావయ్యా
(||pallavi||)
pŏdalĕ niṁḍum̐gaḽala punnama nem̐ḍu
adanu dappaga jājarāḍuduvu rāvayyā
(||pŏda||)
jalajākṣhi momunanu saṁdrodayamāya
nĕlagŏnna navvula vĕnnĕla gāsĕnu
kaligi kannula nallam̐galuvalu vigasiṁchĕ
alari yīgĕdo jāja rāḍuduvu rāvayyā
(||pŏda||)
yĕnasi javvanamuna nedĕṁchĕ vasaṁtagāla
mŏnari movim̐ jiguru luppadilĕnu
gŏnagŏnna turumunam̐ gūḍĕ tummidamūm̐ka
anumāniṁchaga jāja rāḍuduvu rāvayyā
(||pŏda||)
kuṁkuma sĕmaḍa sanum̐ gŏppĕrala niṁḍugŏnĕ
kŏṁkaga goḽle buṭraḍagŏmmu lāyĕnu
laṁkĕlai śhrīveṁkaḍeśha lalanadom̐ gūḍidivi
aṁkĕla nebŏddū jāja rāḍuduvu rāvayyā