Po po ademosi podduvodade

పో పో అదేమోసి పొద్దువోదటే
Language

(॥పల్లవి॥)
పో పో అదేమోసి పొద్దువోదటే
రాఁపులేల వొద్దు యింత రాజసాలు చెల్లవే

(॥పో పో॥)
అతనిపై నాస గల్తే నాడకే పోదువు గాని
నాతో మాటలాడేవేళ నవ్వరాకువే
పాఁతుక నీ కఁతబడి గలవేళ నన్నీఁ
జేతువు గాని నీ బలువు చెప్పకువే నాకు

(॥పో పో॥)
పొత్తులనీకు బతైతే భోగింతు గాని యెఁ దైనా
హత్తి మాయింట నుండఁగా నంటరాకువే
చిత్తములో రేసు గల్తే చెలులఁ గూడుకవచ్చి
వొత్తి సాదింతువుగాని వుద్దండాలు మానవే

(॥పో పో॥)
వానికి నీ కంత గలితే వాడలోఁ జెప్పుదుగాని
యీవేళ నావరు సింతే యేఁకారకువే
శ్రీవేంకటేశుఁడు నన్నుఁజేరికూడె నిప్పు డిట్టె
కోవర ముందువు గాని కుచ్చితాలు మానవే

(||pallavi||)
po po ademosi pŏdduvodaḍe
rām̐pulela vŏddu yiṁta rājasālu sĕllave

(||po po||)
adanibai nāsa galde nāḍage poduvu gāni
nādo māḍalāḍeveḽa navvarāguve
pām̐tuga nī kam̐tabaḍi galaveḽa nannīm̐
jeduvu gāni nī baluvu sĕppaguve nāgu

(||po po||)
pŏttulanīgu badaide bhogiṁtu gāni yĕm̐ dainā
hatti māyiṁṭa nuṁḍam̐gā naṁṭarāguve
sittamulo resu galde sĕlulam̐ gūḍugavachchi
vŏtti sādiṁtuvugāni vuddaṁḍālu mānave

(||po po||)
vānigi nī kaṁta galide vāḍalom̐ jĕppudugāni
yīveḽa nāvaru siṁte yem̐kāraguve
śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐jerigūḍĕ nippu ḍiṭṭĕ
kovara muṁduvu gāni kuchchidālu mānave