పిన్నది యిది కన్నెపిన్నది
(॥పల్లవి॥)
పిన్నది యిది కన్నెపిన్నది
మన్నించి యెట్లయినా మరిగించుకోవయ్యా
(॥॥)
జలజాక్షి నీపై సేసచల్లినవెనకనె
మొలచినచన్నుల మొలకలవి
సొలసి కన్నుల నిన్నుఁజూచినవెనకనె
కళలు నెమ్మోమునఁ గలిగినవి
(॥॥)
వరుసకు నీవొద్దికి వచ్చినవెనకనె
నిరతపు సిగ్గులెల్లా నేరిచినవి
అరుదుగ నీతో మాటలాడినవెనకనె
గరిమ లేఁతనవ్వులు గడించినవి
(॥॥)
యీయల మేలుమంగ నిన్నెనసినవెనకనె
పాయమువచ్చి యీరీతిఁ బరగినది
చాయల శ్రీవేంకటేశ నీయింతై నవెనకనె
కాయపు విలాసాలగని యైనది
(||pallavi||)
pinnadi yidi kannĕbinnadi
manniṁchi yĕṭlayinā marigiṁchugovayyā
(||||)
jalajākṣhi nībai sesasallinavĕnaganĕ
mŏlasinasannula mŏlagalavi
sŏlasi kannula ninnum̐jūsinavĕnaganĕ
kaḽalu nĕmmomunam̐ galiginavi
(||||)
varusagu nīvŏddigi vachchinavĕnaganĕ
niradabu siggulĕllā nerisinavi
aruduga nīdo māḍalāḍinavĕnaganĕ
garima lem̐tanavvulu gaḍiṁchinavi
(||||)
yīyala melumaṁga ninnĕnasinavĕnaganĕ
pāyamuvachchi yīrīdim̐ baraginadi
sāyala śhrīveṁkaḍeśha nīyiṁtai navĕnaganĕ
kāyabu vilāsālagani yainadi